News


దేశీయ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షిస్తాం

Tuesday 22nd October 2019
news_main1571715450.png-29039

  • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: ప్రతిపాదిత భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) కుదుర్చుకునే ముందు దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకు పరిరక్షిస్తామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక సహకార (ఆర్‌సీఈపీ) ఒప్పందం కోసం 10 ఆసియాన్‌ సభ్య దేశాలతోపాటు వాటితో స్వేచ్ఛా వాణిజ్యం కలిగిన ఆరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లోపు చర్చలు ముగించి, 2020 జూన్‌ నాటికి ఒప్పందం చేసుకోవాలన్న లక్ష్యాన్ని ఆసియాన్‌ దేశాలు విధించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌సీఈపీపై చర్చలు వచ్చే నెలలో ముగుస్తాయా? అంటూ మీడియా ప్రతినిధులు సోమవారం ఢిల్లీలో మంత్రిని ప్రశ్నించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైనా కుదుర్చుకునే ముందు దేశీయ పరిశ్రమ ప్రతీ ప్రయోజనాన్ని, దేశ ప్రజల ప్రయోజనాలను సంరక్షిస్తామని ఆయన తెలిపారు. 2009-10లో కాంగ్రెస్‌ హయాంలో మాదిరిగా ఆదరాబాదరాగా వ్యవహరించమని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో దేశ ప్రయోజనాలను పట్టించుకోలేదు. దేశాన్ని నష్టపరిచే క్లాజులు కూడా ఉన్నాయి. దీంతో సేవలపై ఎటువంటి లాభాల్లేవు. సేవలు, పెట్టుబడులు, ప్రతీ అంశంలోనూ జాతి ప్రయోజనాలను కాపాడిన తర్వాతే ఏ దేశంతో అయినా ఒప్పందం విషయంలో ముందుకు వెళతాం’’ అని మంత్రి గోయల్‌ వెల్లడించారు. ఆర్‌సీఈపీ విషయమై అపరిష్కృతంగా ఉన్న అంశాలు వచ్చే నెల బ్యాంకాక్‌లో జరిగే నేతల భేటీ సందర్భంగా చర్చకు వస్తాయని భావిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ సైతం హాజరవుతారని అంచనా. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో చైనా ఉండడంపై దేశీయంగా కొన్ని పరిశ్రమలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒప్పందంలో భాగంగా డైరీ, మెటల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్స్‌పై డ్యూటీలు తగ్గించొద్దని ఆయా రంగాలు ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. You may be interested

విమానయాన రంగంపై పన్నుల భారం దించాలి: సింగ్‌

Tuesday 22nd October 2019

వాషింగ్టన్‌: విమానయాన రంగంపై పన్నుల భారం తగ్గించాలని స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌ సింగ్‌ ప్రభుత్వానికి సూచించారు. ఎంఆర్‌వో(నిర్వహణ, రిపెయిర్‌, ఓవర్‌హాల్‌) విభాగంలో భారత్‌ అద్భుతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో పౌర విమానాయన రంగంపై అధిక పన్నుల భారం ఉందని, అంతర్జాతీయంగా పోటీ పడేందుకు ఇది అవరోధంగా ఉన్నట్టు సింగ్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘విమానయాన రంగం ఉద్యోగాలు కల్పిస్తోంది. భారత్‌ను ప్రపంచంతో అనుసంధానిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు యప్‌టీవీ!

Tuesday 22nd October 2019

‘ట్రిపుల్‌ ప్లే’ సేవలకోసం ఇరుపక్షాల ఒప్పందం దీపావళికి ముందే వేతనాలు: బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు త్వరలో యప్‌ టీవీ ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌–యప్‌ టీవీ సోమవారమిక్కడ అవగాహన ఒప్పందం కుదర్చుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పీకే పుర్వార్, యప్‌ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్‌ రెడ్డి ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2009లో ప్రారంభమైన యప్‌టీవీ 12 భాషల్లో

Most from this category