News


హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం

Wednesday 27th November 2019
news_main1574825869.png-29882

  • వారంలో ప్రారంభం
  • తొలి దశలో వంద మందికి ఉద్యోగాలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్‌లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్‌ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్‌ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు వంద మంది ఇంజనీర్లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ కేంద్రంలో ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) సాంకేతికత మీద పని చేస్తుంది. 



You may be interested

ఎఫ్‌ అండ్‌ ఓ నుంచి టాటా మోటార్స్‌ ఔట్‌

Wednesday 27th November 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్‌ నుంచి టాటా మోటార్స్‌ షేర్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తొలగిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 31 (ఫిబ్రవరి డెరివేటివ్స్‌ సిరీస్‌) నుంచి టాటా మోటార్స్‌, ఎన్‌బీసీసీ, డిష్‌టీవీ, క్యాస్ట్రాల్‌ ఇండియాలు షేర్లను ఈ ఎక్స్చేంజ్‌లు తొలగిస్తున్నాయి. వచ్చే నెల 23 నుంచి సెన్సెక్స్‌ నుంచి కూడా టాటా మోటార్స్‌ను తీసివేస్తున్న విషయం తెలిసిందే. 

హాంగ్‌కాంగ్‌లో ఆలీబాబా జోరు

Wednesday 27th November 2019

8 శాతం లాభంతో హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌   పదేళ్లలో ఇదే అతి పెద్ద ఐపీఓ హాంగ్‌కాంగ్‌: హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో చైనా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం ఆలీబాబా షేర్లు శుభారంభం చేశాయి. ఆలీబాబా షేర్‌ అంచనాల కంటే తక్కువగానే 176 హాంగ్‌కాంగ్‌ డాలర్ల వద్ద లిస్టయినప్పటికీ, ఆ తర్వాత 8 శాతం లాభంతో 189.50 హాంగ్‌కాంగ్‌ డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్ట ‍స్థాయిని తాకింది. చివరకు 6 శాతం లాభంతో 187.50

Most from this category