STOCKS

News


ఆధార్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్‌ కార్డ్‌!

Friday 7th February 2020
news_main1581044280.png-31578

  • రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడి

న్యూఢిల్లీ: పాన్‌ కార్డ్‌ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా సత్వరమే పాన్‌ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వైబ్‌ సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే నమోదిత మొబైల్‌కు వన్‌ టైం పాస్‌ వార్డ్‌ (ఓటీసీ) వస్తుందని, దీనిని ఎంట్రీ చేసి వెంటనే ఈ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.



You may be interested

అరబిందో లాభం రూ.705 కోట్లు

Friday 7th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం తగ్గి రూ.705 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.5,270 కోట్ల నుంచి రూ.5,895 కోట్లకు ఎగసింది. యూఎస్‌ ఫార్ములేషన్స్‌ ఆదాయం 22 శాతం పెరిగి రూ.2,969 కోట్లకు చేరింది. యూరప్‌ ఫార్ములేషన్స్‌ 14.2 శాతం వృద్ధితో రూ.1,476 కోట్ల ఆదాయం సాధించింది.

నిర్మా గ్రూప్‌ చేతికి ఇమామి సిమెంట్‌

Friday 7th February 2020

డీల్‌ విలువ రూ.5,500 కోట్లు  కోల్‌కత: ఇమామి గ్రూప్‌నకు చెందిన ఇమామి సిమెంట్‌ను నిర్మా గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. నిర్మా గ్రూప్‌నకు చెందిన న్యూవొకొ విస్టాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (గతంలో నిర్మా సిమెంట్‌) రూ.5,500 కోట్లకు ఇమామి సిమెంట్‌ను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇమామి గ్రూప్‌ తెలిపింది. గ్రూప్‌ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఇమామి సిమెంట్‌లో వంద శాతం వాటా విక్రయించాలని ఇమామి

Most from this category