News


మార్కెట్లోకి మారుతీ మినీ ఎస్‌యూవీ

Tuesday 1st October 2019
news_main1569897123.png-28640

  • నాలుగు వేరియంట్లలో మారుతీ ఎస్‌-ప్రెస్సో
  • ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌లో 
  • మైలేజీ 21.7 కిమీ. 


న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్‌యూవీ(స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌), ఎస్‌-ప్రెస్సోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్‌యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌(ఎక్స్‌ షోరూమ్‌ ధరలు)లో ఉన్నాయి. స్డాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్‌, డాట్సన్‌ రెడీ-గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్‌-ప్రెస్సో గట్టి పోటీనిస్తుందని అంచనా. 


ఎనిమిదవ బీఎస్‌-సిక్స్‌ మారుతీ మోడల్‌...
మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు లీటర్‌కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్‌(భారత్‌ స్టేజ్‌)-సిక్స్‌ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్‌  కే10 పెట్రోల్‌ ఇంజిన్‌తో  ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్‌-సిక్స్‌ ఇంజిన్‌తో వస్తున్న ఎనిమదవ మోడల్‌ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్‌(5 గేర్లు), ఆటో గేర్‌ షిఫ్ట్‌(ఏజీఎస్‌) ఆప్షన్లలలో లభిస్తుందని తెలిపారు.  వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యుయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌ (యాంటీ-లాక్‌బ్రేకింగ్‌ సిస్టమ్‌) లిమిటర్స్‌, రియర్‌ పార్కింగ్‌ అసిస్ట్‌  సిస్టమ్‌, హై స్పీడ్‌ వార్నింగ్‌ అలర్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్‌ ఛాంబర్‌ హెడ్‌ల్యాంప్స్‌, సిగ్నేచర్‌ సి షేప్‌డ్‌ టెయల్‌ ల్యాంప్స్‌, బాడీ కలర్డ్‌ బంపర్స్‌, ఓఆర్‌వీఎమ్స్‌ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు.  ఇక ఇంటీరియర్‌ విషయానికొస్తే, ఆడియో, వాయిస్‌ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్‌ స్టీరింగ్‌ వీల్‌, 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. 

రూ.640 కోట్ల పెట్టుబడులు...
ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని తెలిపారు. రానున్న ఆర్నెల్లలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఏషియన్‌ దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేస్తామని వివరించారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌ సెంటిమెంట్‌ను మార్చడానికి ఎస్‌-ప్రెస్సో ఇతోధికంగా తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

కాంపాక్ట్‌ కార్లకే మొగ్గు...
ఈ రోజుల్లో కారు వినియోగదారులు కాంపాక్ట్‌ కార్లనే కొనుగోలు చేస్తున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్‌తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్‌-ప్రెస్సో కారును అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్‌ కార్ల డిజైన్‌కు ఎస్-ప్రెస్సో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. 



You may be interested

హైదరాబాద్‌లో 32 శాతం తగ్గిన గృహ విక్రయాలు

Tuesday 1st October 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జులై– సెప్టెంబర్‌ త్రైమాసికంలో నగరంలో 3,280 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం తక్కువని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దు, మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం వంటి కారణాల వల్ల విక్రయాలు తగ్గాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.

పీఎంసీ వ్యవహారం కళ్లు తెరిపించేది...

Tuesday 1st October 2019

కేంద్ర సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు సంక్షోభం కళ్లు తెరిపించేదిగా అభివర్ణించారు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌. ఆడిటర్ల వైఫ్యలం సహా పలు అంశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పీఎంసీ బ్యాంకులో నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకుపై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు పెట్టిన విషయం విదితమే. ‘‘నియంత్రణ సంస్థల పాత్ర ఎంతో కీలకం. అదే

Most from this category