News


1.2 లక్షల స్టోర్లలో ‘పైన్‌ల్యాబ్స్‌’ క్రెడిట్‌, డెబిట్‌ ఈఎంఐ

Wednesday 7th August 2019
news_main1565155648.png-27598

హైదరాబాద్‌: మర్చంట్‌ ప్లాట్‌ఫామ్‌ కంపెనీ పైన్‌ల్యాబ్స్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆరంభించింది. దేశ్యాప్తంగా 1,20,000 స్టోర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది. 90 రకాల బ్రాండ్లు, 19 బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలతో పైన్‌ ల్యాబ్స్‌ ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కస్టమర్ల వద్దనున్న క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని ఆఫర్‌ చేస్తోంది. లక్షలాది కస్టమర్లకు డెబిట్‌, క్రెడిట్‌కార్డులపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పైన్‌ల్యాబ్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ కుష్‌ మెహ్రా తెలిపారు. 



You may be interested

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Wednesday 7th August 2019

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి.  తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే

మాస్టర్‌కార్డ్ కొత్త ఫీచర్‌

Wednesday 7th August 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్‌' పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్‌ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20

Most from this category