News


మార్కెట్లోకి ‘ఇన్నోవా క్రిస్టా’ లిమిటెడ్‌ ఎడిషన్‌

Wednesday 18th March 2020
news_main1584501663.png-32543

- ధర రూ. 21.21 లక్షలు 

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన పాపులర్‌ మల్టీ-పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ‘ఇన్నోవా క్రిస్టా’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదలచేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ వాహనం ధర రూ. 21.21 లక్షలుగా ప్రకటించింది. 2.4 లీటర్ల డీజిల్‌, 5 స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లతో లీడర్‌షిప్‌ ఎడిషన్‌ పేరిట దీనిని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీకేఎం సేల్స్ అండ్ సర్వీస్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోని మాట్లాడుతూ.. ‘ఎంపీవీ సెగ్మెంట్‌లో ఈ వాహనం 50 శాతం వాటాను కలిగిఉంది. ఇందుకు సంకేతంగా లీడర్‌షిప్‌ ఎడిషన్‌ను విడుదలచేశాం’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌!

Wednesday 18th March 2020

5 శాతం జంప్‌చేసిన యూఎస్‌ మార్కెట్లు 54 పాయింట్లు బలపడిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  అమెరికా మార్కెట్లకు ట్రంప్‌, ఫెడ్‌ బూస్ట్‌ అటూఇటుగా ఆసియా స్టాక్‌ మార్కెట్లు దేశీ స్టాక్‌ మార్కెట్ల పతనాలకు నేడు(బుధవారం) ఇన్వెస్టర్లు చెక్‌ పెట్టే అవకాశముంది. మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే చాన్స్‌​కనిపిస్తోంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం 8.30 ప్రాంతం‍లో 54 పాయింట్లు పుంజుకుని 9,044 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,900 పాయింట్ల వద్ద  ముగిసింది.

రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు

Wednesday 18th March 2020

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో  ఈడీ పేర్కొంది.

Most from this category