News


ఇన్ఫోసిస్‌ లాభం రూ. 3800 కోట్లు

Friday 12th July 2019
news_main1562928436.png-27025

జూన్‌ త్రైమాసికానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ. 3798కోట్ల నికరలాభం ప్రకటించింది. కంపెనీ రెవెన్యూ రూ. 21,803 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి అంచనాలను 7.5-9.5 శాతం నుంచి 8.5- 10.5 శాతానికి పెంచింది. కంపెనీ ఎబిటా 4431 కోట్ల రూపాయలుగా, ఎబిటా మార్జిన్‌ 20.5 శాతంగా నమోదు చేసింది. ఎబిటా మార్జిన్‌ గైడెన్స్‌ను 21- 23 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్కెట్‌ వర్గాలు ఇన్ఫీ ఎబిటా అంచనా రూ. 4420 కోట్లు, ఎబిటా మార్జిన్‌ అంచనా 20.3 శాతం,  21817 కోట్ల రూపాయల రెవెన్యూ అంచనా, రూ.3730 కోట్ల లాభం అంచనాగా లెక్కించారు. ఈ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలున్నాయి. క్యు1లో ఇన్ఫీ 270 కోట్ల డాలర్ల డీల్స్‌ను గెలుచుకుంది. డిజిటల్‌ విభాగంలో అంచనాలకు అనుగుణంగా వృద్ది నమోదు చేసింది. కొత్తగా 112 క్లయింట్లను సంపాదించింది. నగదు అవసరాలకు తగినట్లుగా క్యాపిటల్‌ పాలసీ మార్చుకోనున్నట్లు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 



You may be interested

ఐదేళ్లలో 47 బిలియన్‌ డాలర్ల సమీకరణ!

Saturday 13th July 2019

ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం రూపంలో వచ్చే ఆదాయంపై కేంద్ర ‍ప్రభుత్వం ఆధారపడడం అంతకంతకూ పెరిగిపోతోంది. వచ్చే ఐదేళ్ల కాలలో ఏకంగా 47.4 బిలియన్‌ డాలర్లను (రూ.3.25 లక్షల కోట్లు) సమీకరించాలన్నది మోదీ సర్కారు ప్రణాళిక. ప్రభుత్వరంగ బ్లూచిప్‌ కంపెనీల్లో 40 శాతానికి వాటాలు తగ్గించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోనుంది. రెండు దశాబ్దాల కాలంలో కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ప్రైవేటైజేషన్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో

రూపీ స్వల్పకాలిక టార్గెట్‌ 67.50!

Friday 12th July 2019

చార్ట్‌ అడ్వైజ్‌ అంచనా కొన్ని వారాలుగా 69 స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ చెందిన రూపాయి క్రూడాయిల్‌ ధరలుతగ్గడం, అంతర్జాతీయ పరిణామాలతో బలపడడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రకటించిన చర్యలు రూపీ మరింత బలపడేందుకు దోహదం చేస్తాయని చార్ట్‌ అడ్వైజ్‌ ప్రతినిధి రాజా వెంకట్‌రామన్‌ అభిప్రాయపడ్డారు. వర్ధమాన మార్కెట్‌ ఎకానమీల్లో స్వల్పరికవరీ సైతం ఇందుకు తోడ్పాటునిస్తుందన్నారు. మార్కెట్లో గత పరిణామాలకు అనుగుణంగానే రూపీ 69 స్థాయిని తాకిందన్నారు. ఇకపై ఇక్కడ నుంచి

Most from this category