News


అంచనాలను మించి ఇన్ఫీ లాభం

Friday 10th January 2020
news_main1578654527.png-30839

మూడో త్రైమాసికంలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ లాభాలు అంచనాలను మించాయి. క్యు3లో కంపెనీ లాభం 4457 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అనలిస్టులు క్యు3లో 4200 కోట్ల రూపాయల లాభం అంచనా వేశారు. గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం అధికం. త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది. మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా వచ్చాయి. దీంతో పాటు 2019-20 ఆర్థిక గైడెన్స్‌ను కంపెనీ పెంచింది.  స్థిర కరెన్సీ రెవెన్యూ గ్రోత్‌ అంచనాలను 10- 10.5 శాతంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్‌ 9- 10 శాతం ఉంది. లాభాల మార్జిన్లు 21- 23 శాతం ఉంటాయని తెలిపింది. మూడో త్రైమాసికంలో కంపెనీ 180 కోట్ల డాలర్ల బడాడీల్స్‌ గెలుచుకుంది. కొత్తగా 84 మంది క్లయింట్లు వచ్చారని తెలిపింది. 



You may be interested

వొడాఐడియా, ఎయిర్‌టెల్‌తో చైనా మొబైల్‌ సంప్రదింపులు

Friday 10th January 2020

చైనాకు చెందిన అతిపెద్ద మొబైల్‌ ఆపరేటర్‌ ‘చైనా మొబైల్‌’ భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలతో భారత్‌లో క్లౌడ్‌ నెట్‌ వర్క్‌ ఏర్పాటు విషయమై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ‘‘చైనా మొబైల్‌కు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌తో డిసెంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత మార్కెట్‌ పట్ల చైనా మొబైల్‌ ఆసక్తిగా ఉంది. ఈ రెండు సంస్థల్లో ఏదైనా ఒకదానిలో లేదా రెండింటిలోనూ హోల్డింగ్‌ కంపెనీగా

టాటామోటర్స్‌కు చైనా జేఎల్‌ఆర్‌ అమ్మకాల జోష్‌

Friday 10th January 2020

2.50శాతం లాభంతో ముగిసిన షేరు ఇంట్రాడేలో 8నెలల గరిష్టానికి చైనాలో డిసెంబర్‌ అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు వెలువడటంతో టాటా మోటర్స్‌ షేరు శుక్రవారం 2.50శాతంతో ముగిసింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.192.05)తో పోలిస్తే అతిస్వల్ప లాభంతో రూ.192.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో డిసెంబర్‌ నెలకు సంబంధించిన జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు విడుదలయ్యాయి. చైనాలో ఈ డిసెంబర్‌లో మొత్తం  52,814 వాహనాలు విక్రయం జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. వార్షిక

Most from this category