News


మాటలు కాదు..ఫిర్యాదును పరిష్కరించండి: మోహన్‌దాస్‌ పాయ్‌

Friday 22nd November 2019
news_main1574401241.png-29781

విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును ఎదుర్కొన్న కంపెనీలు, ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి కానీ దేవుడు కూడా మార్చలేడంటూ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించకూడదని ఇన్ఫోసిస్‌ మాజీ ఉద్యోగి టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ గురువారం అన్నారు. కాగా ఇన్ఫోసిస్‌పై రెండవ సారి విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదుపై వచ్చిన తర్వాత మోహన్‌ దాస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది మేం చేశాం. ఆ పద్ధతిని అనుసరిస్తున్నాం’ అని కొన్ని వాఖ్యలు చేయడం కాదు. కంపెనీ ఆరోపణలపై ప్రజలు ఆందొళన చెందుతున్నారు’ అని పాయ్‌ అన్నారు.  ‘కంపెనీపై వచ్చే ఫిర్యాదులో నిజమెంతుందో కంపెనీ బోర్డు నిర్దారిస్తుంది. ఆ విషయాలను పంచుకోవాలో లేదో నిర్ణయిస్తుంది’ అని తెలిపారు. అంతేకాకుండా కంపెనీ సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలని, సరియైన డేటాతో ఈ ఆందోళనలను ఎదుర్కోవాలని, స్టాక్‌ హోల్డర్లతో కూడా సరియైన డేటానే పంచుకోవాలని వివరించారు. లైంగిక వేధింపులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తన లేదా సంబంధిత పార్టీ లావాదేవీలు వంటి అంశాలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాకుండా సమాచారం తప్పుగా ఉందని విజిల్‌బ్లోయర్‌లు ఫిర్యాదు చేస్తే, అది కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయమని తెలిపారు.  


  కాగా శుక్రవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 10.41 సమయానికి 3.34 శాతం నష్టపోయి రూ. 689.45  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 713.25 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 711.75 వద్ద ప్రారంభమైంది. 



You may be interested

కోలుకుంటున్న పసిడి

Friday 22nd November 2019

నిన్నటి రోజు 10డాలర్లు నష్టపోయిన పసిడి ధర శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో స్వల్పంగా కోలుకుంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు పెరిగి 1,466 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా చైనా కనీసం పరిమిత ఒప్పందం కుదుర్చుకునేందుకు బీజింగ్‌లో కొత్త రౌండ్ ముఖాముఖి చర్చలకు అమెరికా  అగ్రశ్రేణి వాణిజ్య సంధానకర్తలను ఆహ్వానించినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

రిలయన్స్‌ అప్‌... ఎయిర్‌టెల్‌, ఐడియా డౌన్‌..!

Friday 22nd November 2019

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు 2శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.1543.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జియో, రిటైల్‌ వ్యాపార రంగాల అత్యుత్తమ ప్రదర్శన అప్‌సైడ్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని హెచ్ఎస్‌బీసీ తన నివేదికలో తెలిపింది. అలాగే రిలయన్స్‌ కన్జూ‍్యమర్‌ వ్యాపారం కూడా కంపెనీ వృద్ధికి తోడ్పతుందని తెలిపింది. ప్రస్తుత

Most from this category