News


ఫోర్బ్స్‌ జాబితాలో 17 ఉత్తమ భారత కంపెనీలు

Wednesday 25th September 2019
news_main1569389999.png-28535

  • 3వ స్థానంలో ఇన్ఫోసిస్‌

న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో 17 భారత కంపెనీలు స్థానం సంపాదించాయి. ‘వరల్డ్‌ బెస్ట్‌ రిగార్డెడ్‌ కంపెనీస్‌’ పేరిట విడుదల చేసిన తాజా జాబితాలో దేశీ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఏకంగా 3వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోల్చితే 31 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఇతర భారత కంపెనీల్లో టాటా స్టీల్ (105వ స్థానం), ఎల్‌ అండ్‌ టీ(115), మహీంద్రా అండ్‌ మహీంద్రా (117), హెచ్‌డీఎఫ్‌సీ (135), బజాజ్ ఫిన్‌సర్వ్ (143), పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (153) ), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (155), హిందాల్కో ఇండస్ట్రీస్ (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (204), సన్ ఫార్మా (217), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (224), ఐటీసీ (231), ఏషియన్ పెయింట్స్ (248) స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అత్యధిక స్థానాలను అమెరికా కైవసం చేసుకుంది. మొత్తం 250 కంపెనీలతో ఈ జాబితా విడుదల కాగా, ఇందులో యూఎస్‌ కంపెనీలే 59 ఉన్నాయి. ఆ తరువాత వరుసగా జపాన్‌, చైనా, భారత సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఇక అంతర్జాతీయ చెల్లింపుల సాంకేతిక సంస్థ వీసా తొలి స్థానంలో నిలవగా.. ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ రెండవ స్థానంలో ఉంది. 



You may be interested

తెరపైకి ట్రేడ్‌వార్‌..తగ్గిన చమురు

Wednesday 25th September 2019

యునైటెడ్‌ నేషనల్‌ జనరల్‌ అసెంబ్లీలో చైనా వాణిజ్య విధానాలను, యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ తిరిగి పుంజుకున్నట్టయ్యింది. ఫలితంగా వరుసగా రెండవ రోజు కూడా చమురు ధరలు తగ్గాయి. ఉదయం 10.50 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.87 శాతం నష్టపోయి బారెల్‌ 61.58 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.68 శాతం తగ్గి బారెల్‌ 56.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.       ‘డొనాల్డ్‌ ట్రంప్‌

59 నిమిషాల్లోనే రుణ పథకానికి మెరుగులు

Wednesday 25th September 2019

దిగుమతులను తగ్గించేందుకు విధాన రూపకల్పన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి కేవలం 59 నిమిషాల్లోనే రుణాలను పంపిణీ చేసే పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంస్‌ఎంఈ) మేలు చేసేందుకు గాను, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే విధానాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. ఢిల్లీలో గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా

Most from this category