News


కొత్త ఫిర్యాదుల గురించి తెలియదు

Saturday 14th December 2019
news_main1576295264.png-30219

- ‘క్లాస్ యాక్షన్ దావా’ వార్తలపై ఇన్ఫోసిస్ వివరణ
న్యూఢిల్లీ: అమెరికాలో కొత్తగా మరో క్లాస్ యాక్షన్ దావా దాఖలైనట్లు వచ్చిన వార్తలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. అక్టోబర్‌లో వచ్చిన ఆరోపణలు తప్ప కొత్త ఫిర్యాదుల గురించి తమకేమీ తెలియదని శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు వివరణనిచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణల గురించి అప్పుడే ఎక్స్చేంజీలకు తెలియజేశామని కూడా పేర్కొంది. అనైతిక విధానాలతో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిందనే ఆరోపణతో ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేసినట్లు అమెరికన్ న్యాయసేవల సంస్థ షాల్ లా ఫర్మ్ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్‌ ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలపై ఫిర్యాదు చేయగోరేవారు, క్లాస్ యాక్షన్ దావాలో భాగం కావాలనుకునేవారు తమను సంప్రతించాలని న్యాయసేవల సంస్థలు ఇలాంటి ప్రకటనలివ్వడం సర్వ సాధారణమేనని ఇన్ఫీ తెలిపింది. షాల్ లా ఫర్మ్ కూడా ఇందుకోసమే ప్రకటన చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫీ సీఈవో సలీల్ పరీఖ్‌, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని అక్టోబర్‌లో ప్రజా వేగుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. దీంతో కంపెనీ షేరు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ అంశాలపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు అటు అమెరికన్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ కూడా విచారణ జరుపుతోంది. రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ అమెరికన్ ఇన్ఫెస్టర్ల తరఫున ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేస్తామని అప్పట్లో  ప్రకటించింది. మరోవైపు, అకౌంటింగ్‌ లోపాలపై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) దృష్టి సారించింది. 



You may be interested

వరుసగా నాల్గవ నెలా ఎగుమతులు ‘మైనస్‌’

Saturday 14th December 2019

నవంబర్‌లో వృద్ధిలేకపోగా 0.34 శాతం క్షీణత విలువ రూపంలో 25.98 బిలియన్‌ డాలర్లు దిగుమతులూ క్షీణతలోనే... విలువ 38.11 బిలియన్‌ డాలర్లు వెరసి వాణిజ్యలోటు 12 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా నాల్గవ నెలా నిరాశనే మిగిల్చాయి. అసలు వృద్ధిలేకపోగా -34 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతుల విలువ 25.98 బలియన్‌ డాలర్లు. ఇక దిగుమతులూ క్షీణ బాటలో ఉన్నాయి. -12.71 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి దిగుమతులు విలువ 38.11 బిలియన్‌

బ్యాంకింగ్‌కు మరింత ‘ఎన్‌బీహెచ్‌సీ’ తలనొప్పి

Saturday 14th December 2019

- మూడీస్‌ నివేదిక - మొండిబకాయిల  తీవ్రత పెరిగే అవకాశం ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఎదుర్కొంటున్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సంక్షోభం బ్యాంకింగ్‌ మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ అంచనావేసింది. లిక్విడిటీ సమస్య వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు కస్టమర్లకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని... దీనితో బ్యాంకింగ్‌ రుణ పునఃచెల్లింపుల విషయంలో ఫండింగ్‌ లభించక సంబంధిత కస్టమర్లు ఇబ్బందులు పడే

Most from this category