News


'అనైతిక' ఆరోపణలకు ఆధారాల్లేవు

Tuesday 5th November 2019
news_main1572923822.png-29343

  • ఇన్ఫోసిస్ వెల్లడి

న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ 'అనైతిక' విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. "ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు" అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీకి (ఎన్‌ఎస్‌ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్‌ ఎర్న్‌స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్‌, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ 'అనైతిక' విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కావాలంటే ఇందుకు అవసరమైన ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు.  ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజీ (ఎస్‌ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్‌ఎస్‌ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. You may be interested

బైక్‌ చాల్లే... క్యాబ్‌ ఎందుకు?!

Tuesday 5th November 2019

10 బిలియన్‌ డాలర్లకు చేరిన పరిశ్రమ క్యాబ్‌లతో పోలిస్తే 40 శాతం ధర తక్కువ సిటీలో వేగంగా వెళ్లాలంటే ఇదే బెటర్‌ బైక్‌ డ్రైవర్లుగా మహిళలూ నమోదు మెట్రో రైల్‌తో హైదరాబాద్‌లో 40 శాతం వృద్ధి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బోడ బోడ, హబల్‌ హబల్, ఓజెక్, ఒకాడా... ఇక్కడైతే రాపిడో!!. పేర్లు వేరైనా.. ప్రాంతాలు వేరైనా వ్యాపార మంత్రం ఒక్కటే. అదే బైక్‌ షేరింగ్‌! ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్, వియత్నాం, కాంబోడియా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

Tuesday 5th November 2019

(అప్‌డేటెడ్‌) 76 శాతం వృద్ధి  186 రెట్లు పెరిగిన డివిడెండ్‌ ఆదాయం  16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గృహ్‌ ఫైనాన్స్‌లో

Most from this category