News


ఇన్ఫీ ఫలితాలు.. ఏం చూడాలి?

Tuesday 16th October 2018
news_main1539680061.png-21205

మంగళవారం మార్కెట్‌ అనంతరం ఇన్ఫోసిస్‌ క్యు2 ఫలితాలు ప్రకటించనుంది. మంచి వృద్ది, మార్జిన్ల విస్తరణ.. ఈ దఫా ఫలితాల్లో ఉండొచ్చని ఎక్కువమంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. పనయా డౌన్‌గ్రేడ్‌కు సంబంధించిన నష్టాలు ముగిసిపోవడంతో కలిసివస్తుందని భావిస్తున్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎమ్‌కే గ్లోబల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ లాంటి ప్రముఖ బ్రోకరేజ్‌ల అంచనా ప్రకారం కంపెనీ నికరలాభం ఈ దఫా 3880- 4150 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చు. స్థిర కరెన్సీ వృద్ధి 2.2- 3.5 శాతం మేర ఉండవచ్చు. సీజనల్‌ బలాలకు తోడు బీఎఫ్‌ఎస్‌ఐ తదితర రంగాల్లో మెరుగుదలతో కంపెనీ ఫలితాలు జోరందుకుంటాయని భావిస్తున్నట్లు బ్రోకరేజ్‌లు తెలిపాయి. ఎబిటా 40 శాతం మేర పెరిగి 24.1 శాతం వరకు చేరవచ్చని అంచనాలున్నాయి. రూపీ క్షీణత కలిసివచ్చినా, వేతనాల పెంపు భారం కొంత మేర డిస్కౌంట్‌కు కారణం కానుంది. క్రాస్‌కరెన్సీ తలనొప్పులు 100- 150 బీపీఎస్‌ వరకు ఉండొచ్చు. 
వీటిని పరిశీలించాలి...
- కొత్త నాయకత్వ వ్యూహాలు, అంతర్గత స్థిరత్వం.
- బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌రంగాలపై అవుట్‌లుక్‌.
- మార్జిన్లపై కామెంటరీ.
- రెవెన్యూ వృద్ధి అంచనాల సమీక్ష.You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల పరుగు

Tuesday 16th October 2018

3శాతం ర్యాలీ చేసిన ఎస్‌బీఐ షేరు మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లు ర్యాలీ సూచీలను ముందుండి నడిపిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ సూచీ ఇంట్రాడేలో 3శాతం లాభపడి 2,783.90 వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం గం.2.00లకు ఇండెక్స్‌ 2.50శాతం లాభపడి 2,775.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 12 షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.266 కోట్లు

Tuesday 16th October 2018

ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1 శాతం వృద్ధితో రూ.266 కోట్లకు పెరిగింది. మొండి బకాయిల కేటాయింపులు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ క్యూ2లో వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13.7 శాతం వృద్ధితో రూ.1,022 కోట్లకు ఎగసింది. ఫెడరల్‌ బ్యాంక్‌ రుణ

Most from this category