News


తదుపరి దర్యాప్తు గురించి సమాచారం లేదు

Saturday 25th January 2020
news_main1579924697.png-31190

  • ప్రజావేగు ఫిర్యాదులపై ఇన్ఫోసిస్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ కంపెనీ బ్యాలన్స్‌ షీట్లలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కంపెనీఈ సీఈవో, సీఎఫ్‌వోలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజావేగు ఫిర్యాదులపై తదుపరి దర్యాప్తు గురించి సెబీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని కంపెనీ ప్రకటించింది. ప్రజావేగు ఫిర్యాదుపై అంతర్గతంగా ఆడిట్‌ విచారణ చేసిన ఇన్ఫోసిస్‌ ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవంటూ సీఈవో సలీల్‌ పరేఖ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేసింది. అయితే, ఈ ఫిర్యాదుపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సెబీ ఆదేశించే అవకాశం ఉందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇన్ఫోసిస్‌ స్పందిస్తూ.. జనవరి 23న మీడియాలో వచ్చినట్టుగా సెబీ నుంచి తదుపరి ఆడిట్‌కు సంబంధించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. 



You may be interested

యూఎస్‌ మార్కెట్లకు కరోనా వణుకు

Saturday 25th January 2020

ఇంట్రాడేలో డోజోన్స్‌ పతనం ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు డీలా టాటా మోటార్స్‌ 1.4 శాతం డౌన్‌ చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా ఇల్లినాయిస్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు వెల్లడికావడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో డోడోన్స్‌ ఇండెక్స్‌ తొలుత 300 పాయింట్లు పతనమైంది. తదుపరి కొంతమేర కోలుకుంది. చివరికి శుక్రవారం డోజోన్స్‌ 170 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 28,990 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(0.9 శాతం) తక్కువగా

వెలుగులోకి భారత్‌ హోటల్స్‌ రూ.1,000 కోట్ల అక్రమాస్తులు

Saturday 25th January 2020

విదేశాలకు నల్లధనం తరలింపు ఆదాయపన్ను సోదాల్లో గుర్తింపు న్యూఢిల్లీ: లలిత్‌ హోటల్స్‌ బ్రాండ్‌తో ఆతిథ్య సేవల్లో ఉన్న భారత్‌ హోటల్స్‌ గ్రూపు అక్రమాల పుట్ట ఆదాయపన్ను అధికారుల సోదాలతో బయటపడింది. లెక్కల్లో చూపించిన రూ.1,000 కోట్ల ఆస్తులు, నల్లధనం విదేశాల్లో ఉన్నట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సీబీడీటీ తన ప్రకటనలో పేరును వెల్లడించలేదు కానీ, జ్యోత్స్న సూరి ఆధ్వర్యంలోని భారత్‌ హోటల్స్‌ గ్రూపునకు

Most from this category