STOCKS

News


విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును తిప్పికొట్టిన ఇన్ఫోసిస్‌ లీగల్‌ టీం

Thursday 14th November 2019
news_main1573717838.png-29586

   ఇన్ఫోసిస్ సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న విజిల్‌బ్లోయర్‌ లేఖను కంపెనీ, పబ్లిక్‌తో పంచుకోలేదనే ఆరోపణలను కంపెనీ లీగల్‌ టీం గురువారం తిప్పికొట్టింది. అంతర్గత విజిల్‌ బ్లోయర్‌ పాలసీ ఆధారంగా కంపెనీ అన్ని నిబంధనల్ని పాటిస్తోందని లీగల్‌ టీంలోని న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులోని అంశాల ఖచ్చితత్వాన్ని పరిశీలించకుండా, ఈ ఫిర్యాదును పబ్లిక్‌కు విడుదల చేస్తే కంపెనీ, మైనార్టీ ఇన్వెస్టర్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్‌ షేరు అక్టోబర్‌ నెలలో 16 శాతం పడిపోయాక, ఈ ఫిర్యాదుపై కంపెనీ స్పందించిన విషయం తెలిసిందే.
    ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా విజిల్‌బ్లోయర్‌ లేఖ ఇన్ఫోసిస్‌ బోర్డుకు, యుఎస్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెప్టెంబర్‌ 21 న అందింది. ఆ తర్వాత నెలరోజులకు అంటే మీడియాలో ఈ వార్త లీక్‌ అయ్యేంత వరకు పబ్లిక్‌కు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. కాగా విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదులోని అంశాలను పబ్లిక్‌ షేరుహోల్డర్లకు తెలియకుండా దాచినందుకు ఇన్ఫోసిస్‌పై ఎక్సేంజ్‌ బోర్డులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. వీటితో పాటు దేశీయ మార్కెట్‌ నియంత్రణ సంస్థ(సెబీ) కూడా విజిల్‌బ్లోయర్‌ లేఖను విచారణలోకి తీసుకొని స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో పాటు, లోపాలను కప్పిపుచ్చుకోవడం వంటి నాలుగు అంశాలపై సెబీ, ఇన్ఫోసిస్‌పై దర్యాప్తును కొనసాగిస్తోంది. ఈ నివేదికపై ఇన్ఫోసిస్‌ వ్యాఖ్యానించడానికి విముఖతను వ్యక్తం చేసింది. 
      కంపెనీపై వచ్చే ఆరోపణలలోని నిజాలను కంపెనీ స్వంత ఆడిట్‌ సభ్యులు నిర్దారించేంత వరకూ ఈ ఆరోపణలలోని అంశాలను కంపెనీ బయటపెట్టలేదని ఇన్ఫోసిస్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది ఒకరు తెలిపారు. ‘సరియైన సమయానికి ముందే స్పందిస్తే ఇన్ఫోసిస్‌ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. ఈ అంశంపై మా స్థానాన్ని వివరిస్తూ, స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇప్పటికే సమాధానం ఇచ్చాం. వచ్చే కొన్ని వారాలలో ఈ అంశంపై సెబీని కలవడానికి ప్రణాళికలు వేస్తున్నాం’ అని న్యాయవాది అన్నారు.  
విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదుపై సెబీ మార్గదర్శకాలు..
విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదులను ఏవిధంగా పరిష్కారించాలనేదానిపై కొన్ని మార్గదర్శకాలను సెబీ అనుసరిస్తోంది. మార్కెట్లో నమోదైన కంపెనీలు వాటి స్వంత విజిల్‌ బ్లోయర్‌ పాలసీని ఏర్పాటు చేసుకొని ఈ ఫిర్యాదులను ఆ పాలసీకి అనుగుణంగా పరిష్కరించుకోవాలి. ఈ పాలసీ ప్రకారం కంపెనీ బోర్డు, ఈ విషయం మెటిరియల్‌ డెవలప్‌మెంటా? కాదా? నిర్ణయించగలిగే విచక్షణను కలిగివుండాలి. ఒక వేళ కనిపెట్టినట్టయితే ఈ విషయానికి సంబంధించిన విషయాలను పబ్లిక్‌ షేరు హోల్డర్లకు విడుదల చేయాలి.    
   ‘విజిల్‌బ్లోయర్లు తమ లేఖలను నియంత్రణ సంస్థలకు పంపడం ​పెరుగుతోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదా మోసపూరిత ట్రేడింగ్‌ జరగకపోతే,  ఈ ఆరోపణలపై మొదట కంపెనీ దర్యాప్తు సాగించాలి’ అని కంపెనీ లీగల్‌ సభ్యుల్లోని మరొక న్యాయవాది అన్నారు. అంతేకాకుండా ఈ పద్ధతి మంచిది కాదని అన్నారు. దీని ఫలితంగా పనికిమాలిన ప్రతీ ఆరోపణలను స్టాక్‌ఎక్సేంజ్‌లకు వెల్లడించవలసి వస్తుందని తెలిపారు. అయినప్పటికి కొంత మంది న్యాయ నిపుణులు, ఇన్ఫోసిస్‌ విజిల్‌ బ్లోయర్‌ లేఖను పబ్లిక్‌ షేరుహోల్డర్లకు వెల్లడిస్తే బాగుండేది అనే ధోరణిని వెల్లబుచ్చుతుండడం గమనార్హం. కాగా నవంబర్‌ మొదటి వారంలో ఇన్ఫోసిస్‌ ఉన్నతధికారులపై మరొక విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే.
   ఇన్ఫోసిస్‌పై వచ్చిన విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును కంపెనీ లీగల్‌ సభ్యులు తిప్పికొట్టడంతో ఇన్ఫోసిస్‌ షేరు విలువ గురువారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 1.09 సమయానికి ఈ షేరు 2.36 శాతం లాభపడి రూ. 707.65 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 691.35 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం సెషన్‌లో రూ. 696.35 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.You may be interested

నష్టాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కష్టాలు

Thursday 14th November 2019

3శాతం నష్టపోయిన నాల్కో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనా ఈ అక్టోబర్‌ ఆర్థిక గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకాకపోవడం, అమెరికాతో మొదటి దశ వాణిజ్య చర్చలు సఫలంపై అనుమానాలు వ్యక్తం కావడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై పడింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో

రూ.38వేల పైకి పసిడి

Thursday 14th November 2019

దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ ధర తిరిగి రూ.38వేల మార్కును అందుకుంది. అమెరికా-చైనాల మధ్య మొదటి దశ చర్చల విజయవంతంపై అనుమానం తలెత్తడంతో పాటు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 2నెలల కనిష్టానికి దిగిరావడం తదితర కారణాలు పసిడి పుంజుకునేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.35.00ల లాభంతో రూ.38132.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయమార్కెట్లో పసిడి ధర మరింత ర్యాలీ చేసి

Most from this category