News


ఉద్యోగుల తొలగింపు...కాగ్నిజెంట్‌ బాటలోనే ఇన్ఫోసిస్‌

Wednesday 6th November 2019
Markets_main1573033114.png-29397

నికరంగా 7000 మంది మిడ్‌, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులకు ఉద్వాసన చెప్పనున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ప్రకటించిన కొద్దిరోజులకే మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా అదే మార్గాన్ని అనుసరించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇన్ఫోసిస్, వివిధ స్థాయిలలో అంచనాలకు అనుగుణంగా పనిచేయని(ఇన్వాలంటరీ యాట్రిషన్‌) ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడుతోందని కంపెనీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ‘అధిక పనితీరును కనబరిచే ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలు, వ్యాపారాన్ని సమగ్రపరిచేందుకు ఇన్వాలంటరీ యాట్రిషన్‌ను వినియోగిస్తుంటాయి. ఏ స్థాయిలోనైనా దీనిని ‘పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు’గా భావించకూడదు’ అని ఈ ఐటీ కంపెనీ అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు తెలిపారు. కానీ ఈ కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగించనుందనే అంశంపై సమాచారం లేదు. 
    మీడియాలో ఇన్ఫోసిస్‌ 10,000కు పైగా ఉద్యోగులను తొలగించనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘వివిధ స్థాయిలలో వేలకొలది ఉద్యోగులను మాత్రం తొలగించడం లేదు’ అని ఇన్ఫోసిస్‌ సీనియర్‌ ఉద్యోగి ఒకరు అన్నారు. ‘కంపెనీ ఇప్పటి వరకు దీనిపై సమాచారాన్ని పంచుకోనప్పటికి, మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది’ అని ఆయన అన్నారు. కాగా పెద్ద కంపెనీలు, ఉద్యోగులు తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోతే ఇన్‌వాలంటరీ యట్రిషన్లో‌  భాగంగా వారిని తొలగిస్తారు. ‘దీనిని ‘తొలగింపు’గా భావించకూడదు. ఎందుకంటే రెండేళ్లు లేదా రెండు త్రైమాసికాలలో నీ పనితీరు బాగలేకపోతే నిన్ను వెళ్లి పోమంటారు. ఇది పనితీరుకు సంబంధించిన అంశం’ అని ఈ ఉద్యోగి తెలిపారు.
    ఇన్ఫోసిస్‌ మాత్రమే కాకుండా సాంకేతిక దిగ్గజం విప్రో కూడా తాజా  త్రైమాసికంలో ఎంతోమంది ఉద్యోగులు స్వచ్చందంగా వైదొలిగారు, కంపెనీ ఎంత మందిని తొలగించిందనే అంశాలను ప్రకటిస్తుంది. ‘మేము మా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అప్పగించం. అంతర్గత పక్రియ కాబట్టి ఈ సమాచారాన్ని పంచుకోలేము. అంతేకాకుండా మీరు అనవసరంగా ఉన్నారు కాబట్టి రేపటి నుంచి రావద్దని మా ఉద్యోగులకు చెప్పము’ అని ఈ ఉద్యోగి అన్నారు. ఇతర కంపెనీలలా కాకుండా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులను తొలగించే ముందు వారు సిద్ధమవ్వడానికి తగినంత సమయమిస్తామని తెలిపారు. కంపెనీ కన్సాలిడేటడ్‌ యాట్రిషన్‌ రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన స్వల్పంగా తగ్గి 21.7 శాతానికి చేరుకుంది. ఇది జూన్‌ త్రైమాసికంలో 23.4 శాతం ఉండగా, గతేడాది 22.2 శాతంగా ఉంది. కానీ సెప్టెంబర్‌ త్రైమాసికంలో త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ 7,457 ఉద్యోగులను కొత్తగా నియమించుకోగా, ఏడాది ప్రాతిపదికన 18,747 మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీ మొత్తం ఉద్యోగులు జూన్‌ త్రైమాసికంలో 229,029 మంది ఉండగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో అది 236,486కు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది 217,739 మంది ఉండడం గమనార్హం. You may be interested

సెన్సెక్స్‌ లాభం 222 పాయింట్ల

Wednesday 6th November 2019

రాణించిన ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు ఇంట్రాడేలో 12000 స్థాయిని తాకిన నిఫ్టీ మార్కెట్‌ నష్టం ఒకరోజుకే పరిమితం అయ్యింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక, రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం సూచీలు లాభాల ముగింపును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 40,469.78 వద్ద, నిఫ్టీ 43.80 పాయింట్లు పెరిగి 11,961 వద్ద స్థిరపడ్డాయి. అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, మీడియా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌

పెరిగిన కెనరా బ్యాంక్‌ లాభం...షేరు 3 శాతం అప్‌

Wednesday 6th November 2019

3శాతానికి పైగా ర్యాలీ చేసిన షేరు  మెండిబకాయిలకు  కేటాయింపులు తగ్గడం, ఇతర ఆదాయాలు పెరగడంతో కెనరా బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్లో మెరుగైన పనితీరును కనబరిచింది. వార్షిక ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో రూ.365 కోట్ల నికర లాభం సాధించింది. గతే ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో సాధించిన రూ.299.5 కోట్లతో పోలిస్తే ఇది 22శాతం అధికం. మొత్తం ఆదాయం 15.42శాతం వృద్ధితో రూ.15509.36 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో మొత్తం ఆదాయం

Most from this category