News


ఇన్ఫీకి మరో తలనొప్పి

Friday 13th December 2019
news_main1576208550.png-30200

(అప్‌డేటెడ్‌...)

  • అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా
  • ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు

లాస్ ఏంజెలిస్:   సీఈవో, సీఎఫ్‌వోలపై ప్రజావేగుల ఫిర్యాదులతో సతమతమైన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు తాజాగా మరో తలనొప్పి ఎదురైంది. షేర్‌హోల్డర్ల హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యాయసేవల సంస్థ ది షాల్ లా ఫర్మ్‌ వెల్లడించింది. మార్కెట్‌ను తప్పుదోవ పట్టించేలా ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని షాల్‌ ఆరోపించింది. స్వల్పకాలిక లాభాలను పెంచి చూపించడం కోసం ఆదాయాల లెక్కింపునకు తప్పుడు విధానాలు పాటించిందని ఫిర్యాదులో పేర్కొంది. పెద్ద డీల్స్‌పై ప్రామాణికంగా జరపాల్సిన సమీక్షలు జరగకుండా సీఈవో సలిల్ పరేఖ్ తప్పించారని షాల్ ఆరోపించింది. పైగా ఈ అకౌంటింగ్ లొసుగులు, వివాదాస్పద డీల్స్ వివరాలను ఆడిటర్లు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్లనివ్వకుండా ఫైనాన్స్ విభాగంపై యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. "ఈ అంశాలకు సంబంధించి కంపెనీ అందర్నీ తప్పుదోవ పట్టించేలా అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేసింది. ఈ వ్యవహారం గురించి మార్కెట్లకు నిజాలు తెలిసిన తర్వాత.. ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది" అని షాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. 1,00,000 డాలర్ల పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు ..క్లాస్ యాక్షన్ దావాలో భాగం అయ్యేందుకు తమను కలవాలని సూచించింది. 2018 జూలై 7-2019 అక్టోబర్ 20 మధ్య కాలంలో ఇన్ఫీ షేర్లను కొనుగోలు చేసిన వారు .. డిసెంబర్ 23లోగా సంప్రతించాలని పేర్కొంది. 

వివరణ కోరిన స్టాక్ బీఎస్‌ఈ ...
అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వార్తలపై వివరణనివ్వాలంటూ ఇన్ఫీకి స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్‌ఈ సూచించింది. అయితే, దీనిపై కంపెనీ స్పందించాల్సి ఉంది. ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్‌, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లు వ్యాపారపరంగా అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ విచారణ జరుపుతోంది. అటు రోజెన్ లా ఫర్మ్ సంస్థ .. క్లాస్ యాక్షన్ దావా వేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు, అంతర్గతంగా ఇన్ఫీ కూడా ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది.  



You may be interested

భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్ ప్రారంభం

Friday 13th December 2019

ఈ నెల 20న ముగింపు  రూ.15,000 కోట్ల సమీకరణ లక్ష్యం  న్యూఢిల్లీ: దేశంలో తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌), భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.7 రెట్లు (రూ.2,980కోట్ల మేర బిడ్‌లు వచ్చాయి)ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు నేటి(శుక్రవారం) నుంచి సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చు. ఈ నెల 20న ముగిసే ఈ ఈటీఎఫ్‌ ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించాలని

ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం

Friday 13th December 2019

ఎయిరిండియాలో పూర్తి వాటాల విక్రయం కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టీకరణ న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని (ఏఐఎస్‌ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మకంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర

Most from this category