News


ప్రైవేటు కంపెనీల మాదిరే పీఎస్‌యూల నిర్వహణ: సీఐఐ

Monday 18th November 2019
news_main1574049159.png-29659

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) సైతం ప్రైవేటు కంపెనీల మాదిరే పాలనా ప్రమాణాలను అనుసరించే విధంగా ఉండాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. సీవీసీ, కాగ్‌, సీబీఐ దర్యాప్తు వంటివి తరచుగా ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాల్లో అతి జాగ్రత్త లేదా నిర్ణయాలు నిలిచిపోవడానికి కారణమవుతున్నాయని, ఇలా కాకుండా చూసి, ప్రైవేటు సంస్థల మాదిరే పనిచేసే వాతావరణం కల్పించాలని పేర్కొంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడగలవని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అన్నారు. ‘ది రైజ్‌ ఆఫ్‌ ఎలిఫెంట్‌:ఎన్‌హాన్సింగ్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఆఫ్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలపై రూపొందించిన పరిశోధన నివేదికను విడుదల చేశారు.  



You may be interested

పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు

Monday 18th November 2019

-టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ పన్ను ఆదా కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోనూ ఇన్వెస్ట్‌ చేసే వారున్నారు. సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ కూడా ఒకటి.  రాబడులు టాటా

కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు

Monday 18th November 2019

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్‌ సీడ్‌ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు

Most from this category