News


టెలికం.. లైన్‌ కట్‌ అవుతోంది..

Friday 20th December 2019
news_main1576811402.png-30319

  • ట్రాయ్‌ తక్షణం జోక్యం చేసుకోవాలి
  • ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యలు
  • ఏఆర్‌పీయూ రూ.300కు చేరవచ్చని అంచనా

న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండింటి మధ్య సమతౌల్యం ఉండేలా ట్రాయ్‌ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బడ్జెట్‌ ముందరి సమావేశాల్లో భాగంగా ఇతర కార్పొరేట్‌ దిగ్గజాలతో కలిసి గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సందర్భంగా సునీల్‌ మిట్టల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టెలికం కంపెనీల ఏఆర్‌పీయూ (యూజరుపై సగటు ఆదాయం) క్రమంగా రూ.200 నుంచి రూ.300 దాకా చేరొచ్చని చెప్పారాయన.  "డేటా, వాయిస్, ఇతర సర్వీసులకు కలిపి నెలకు ఒకో యూజరు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.450–500 దాకా చెల్లించవచ్చని అంచనా. వీటి సగటు సుమారు రూ.300 దాకా ఉండవచ్చు. డాలర్‌ రూపంలో నెలకు 4 డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత చౌక టారిఫ్‌లు ఇవే. డేటా వినియోగం మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువే" అని మిట్టల్‌ పేర్కొన్నారు. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీలను (ఐయూసీ) ట్రాయ్‌ ఏడాది పాటు వాయిదా వేయడం, టెలికం సేవలకు కనీస చార్జీలను నిర్ణయించే అంశంపై దృష్టి సారించడం తదితర అంశాల నేపథ్యంలో సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
కర్ణాటకలో 3జీ సేవలకు ఎయిర్‌టెల్‌ గుడ్‌బై
ఎయిర్‌టెల్ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఇకపై అక్కడ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను.. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది. ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం 2జీ సేవలు యథాప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపింది. 



You may be interested

రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్‌’ వ్యాపారం

Friday 20th December 2019

బెంగళూరులో ఘనంగా 14వ వార్షికోత్సవం సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మాధవన్‌ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రతించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్‌ పరుపులు

క్రెడాయ్‌ రియాల్టీ పురస్కారాలు..28న

Friday 20th December 2019

క్రిసిల్‌ సంస్థద్వారా ప్రాజెక్టుల పనితీరు పరిశీలన నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ శాఖ ఛైర్మన్‌ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న క్రియేట్‌-2019 పేరిట హైదరాబాద్‌ ‘జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌’లో క్రెడాయ్‌ తెలంగాణ రియాల్టీ

Most from this category