News


పారిశ్రామిక ఉత్పత్తి... కొంచెం ఊరట

Friday 13th March 2020
news_main1584069153.png-32447

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో కొంచెం ఊరట కలిగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు  2 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆరు నెలలుగా దేశం ఈ స్థాయి పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటును కూడా చూడకపోవడం గమనార్హం. మైనింగ్‌, విద్యుత్‌ ఉత్పత్తి కొంచెం పుంజుకోవడం జనవరిలో కొంత ఊరటనిచ్చింది. 2019 జూలైలో 4.9 శాతం వృద్ధి రేటు నమోదయింది. అటు తర్వాత ఆగస్టు (-1.4 శాతం), సెప్టెంబర్‌ (-4.6 శాతం), అక్టోబర్‌ (-6.6 శాతం)నెలల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. అయితే నవంబర్‌ (1.8 శాతం), డిసెంబర్‌ (0.1 శాతం), జనవరి (1.6 శాతం) వృద్ధిరేట్లు నమోదయ్యాయి. 



You may be interested

ద్రవ్యోల్బణం... తగ్గినా తలనొప్పే!

Friday 13th March 2020

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.58 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలో ఉన్న వస్తువుల బాస్కెట్‌ ధర 2019 ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో 6.58 శాతం పెరిగిందన్నమాట. జనవరిలో నమోదయిన 7.59 శాతంకన్నా ఫిబ్రవరిలో తగ్గినప్పటికీ,  ఈ స్థాయీ (6.58 శాతం) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కు కేంద్రం నిర్దేశిత స్థాయి (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 2

'యస్‌'బీఐ ప్రణాళికకు ఓకే..

Friday 13th March 2020

యస్‌ బ్యాంకులో 725 కోట్ల షేర్ల కొనుగోలు రూ. 7,250 కోట్ల ఖరీదు ఆమోదముద్ర వేసిన ఎస్‌బీఐ ఈసీసీబీ ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసేందుకు తమ ఈసీసీబీ నుంచి అనుమతి వచ్చినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ 725 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 10 చొప్పున

Most from this category