News


జమ్మూ కశ్మీర్‌ ప్రజల జీవనాన్ని మార్చేస్తుంది

Tuesday 6th August 2019
news_main1565072557.png-27569

రాష్ట్రాభివృద్ధికి బాటలు
కేంద్రం నిర్ణయాలను కొనియాడిన పారిశ్రామిక వర్గాలు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... ఆ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని కల్పిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు వీలు కల్పించి, అభివృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయం ‍వ్యక్తం చేశాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విషయమై ట్వీట్లతో తమ స్పందన తెలియజేశారు. 

ఆర్టికల్‌ 370ని ఉపసంహరణ జమ్మూ కశ్మీర్‌ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం కల్పిస్తుంది. ఆర్టికల్‌ 370 తొలగించడం అన్నది బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకటి. భారీ మెజారిటీతో ఇటీవల ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలోని సర్కారుకు అధికారం ఇచ్చినందున, మెజారిటీ ప్రజల మద్దతు దీనికి ఉంది. జమ్మూ కశ్మీర్‌ ప్రజలకు, ఆ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం బాటలు పరుస్తుంది.
- రాజీవ్‌ తల్వార్‌, పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌

మాకు అక్కడ రెండు ఫ్యాక్టరీలు ఉండేవి. కశ్మీర్‌లోని తులిప్‌ గార్డెన్‌ కూడా ఒకటి. మిలిటెంట్ల కారణంగా వాటిని మూసేయాల్సి వచ్చింది. ఆర్టికల్‌ 370 ఉపసంహరణతో పెట్టుబడులు తిరిగి వస్తాయి. భూమిపై స్వర్గం ఎక్కడైనా ఉందంటే అదిక్కడే. ఇక్కడే. చరిత్రాత్మక రోజు. ఒకటే పతాకం. ఒకటే దేశం. ఒకటే రాజ్యాంగం. 
- హర్ష గోయంకా, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌

ఈ నిర్ణయాత్మక చర్య విషయంలో బీజేపీకే నా మద్దతు. వారు తమ ఎన్నికల హామీని అమలు చేయడం ఆనందంగా ఉంది. ఆర్టికల్‌ 370 కశ్మీరీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసింది. దీని ఉపసంహరణ అన్నది చరిత్రాత్మక నిర్ణయం. భారత ప్రధాన స్రవంతిలోకి జమ్మూ కశ్మీర్‌ వచ్చేందుకు, ఎంతో గొప్పదైన మనదేశ సమ్మిళిత వృద్ధిలో భాగం అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. శాంతి ఏర్పాటును ఏదీ అడ్డుకోలేదు. 
- సజ్జన్‌ జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సీఎండీ

దేశం దృష్టిలో ఈ రోజు చరిత్రాత్మకమైనది. అభివృద్ధి, శాంతికి మార్గాన్ని తెరిచింది. కశ్మీరీ ప్రజలకు సాధికారత కల్పించడంతోపాటు, భారత్‌ను బలంగా ఈ నిర్ణయం మారుస్తుంది.  
- గౌతం అదానీ, అదానీ గ్రూపు చైర్మన్‌ 

ఇది మరో సోమవారం ఉదయం మాత్రం కాదు. కశ్మీర్‌ విషయంలో ఊపిరి పీల్చుకునేందుకు యావత్‌ దేశం వేచి చూస్తోంది. అక్కడి ప్రజలు భద్రంగా ఉండాలని కోరుకోవాలి. వచ్చే నిర్ణయం దేశాన్ని మరింత బలంగా, భవిష్యత్తును మరింత సానుకూలంగా మారుస్తుంది. (ప్రభుత్వ నిర్ణయానికి ముందు ట్వీట్‌). కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిస్పందన వస్తుంది. మరి గతంలో ఇది ఎందుకు సాధ్యం కాలేదు? మనమంతా కశ్మీరీలను మనదేశంలో విడదీయలేని, విడదీయరాని భాగంగా స్వీకరించాల్సిన సమయం ఇది.
- ఆనంద్‌ మహీంద్రా,  మహీంద్రా గ్రూపు చైర్మన్‌You may be interested

వృద్ధి బాటపైకి సేవల రంగం: పీఎంఐ

Tuesday 6th August 2019

న్యూఢిల్లీ: భారత సేవల రంగం జూలైలో​తిరిగి వృద్ధి బాటపైకి వచ్చినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. జూలైలో ఈ సూచీ 53.8 గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ కేవలం 49.6 వద్ద ఉంది. పీఎంఐ ప్రకారం... సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. జూలై నెలలో పెరిగిన ఆర్డర్లు సేవల రంగాన్ని తిరిగి వృద్ధి

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ అమర్‌

Tuesday 6th August 2019

జీవిత బీమా రంగంలోని అగ్రగామి సంస్థ ఎల్‌ఐసీ నాన్‌ లింక్డ్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని ‘జీవన్‌ అమర్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఆఫ్‌లైన్‌లో లభించే ఈ ప్లాన్‌లో రెండు రకాల మరణ పరిహార ప్రయోజనాల్లో నచ్చిన దానిని ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. పాలసీ కాల వ్యవధి వరకు ఒకటే సమ్‌ అష్యూర్డ్‌ (లెవల్‌ సమ్‌ అష్యూర్డ్‌) ఒకటి అయితే, సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) నిర్ణీత కాలానికోసారి పెరుగుతూ వెళ్లేది రెండో ఆప్షన్‌.

Most from this category