News


నిరాశపరిచిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

Thursday 10th October 2019
news_main1570704054.png-28808

లాభంతో పాటు ప్రొవిజన్స్‌లో కూడా పెరుగుదల
సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఇండస్‌ఇండ్‌బ్యాంకు నికరలాభం గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగి రూ. 1384 కోట్లకు చేరింది. అయితే అనలిస్టులు సరాసరిన నికరలాభంలో 55- 60 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో బ్యాంకు ఎన్‌ఐఐ 32 శాతం వృద్దితో రూ. 2909 కోట్లకు చేరింది. ఇతరాదాయాలు 31 శాతం పెరిగి రూ. 1727 కోట్లను చేరాయి. నికర వడ్డీ ఆదాయంలో పెరుగుదల, పన్నుల తగ్గింపుతో బ్యాంకు లాభాలు పెరిగాయి. సమీక్షా కాలంలో పన్ను వ్యయాలు 34 శాతం దిగివచ్చి రూ. 479 కోట్లకు చేరాయి. లాభాల పరంగా ఓకే అనిపించినా ఆస్తుల నాణ్యత విషయంలో బ్యాంకు అనూహ్య ఫలితాలు నమోదు చేసింది. బ్యాంకు ప్రొవిజన్లు 25 శాతం పెరిగి రూ. 738 కోట్లను చేరాయి. ఇదే సమయంలో స్థూల ఎన్‌పీఏలు ఒక్కమారుగా గతేడాదితో పోలిస్తే 145.33 శాతం పెరిగి రూ. 1781 కోట్లకు చేరాయి. మొత్తం అడ్వాన్సుల్లో జీఎన్‌పీఏల వాటా గత త్రైమాసికంలో 2.15 శాతం ఉండగా తాజాగా 2.19 శాతానికి పెరిగింది. సమీక్షా కాలంలో డిపాజిట్లు 23 శాతంపెరుగుదలతో రూ. 2.07 లక్షల కోట్లను చేరినట్లు బ్యాంకు తెలిపింది. ఇదే సమయంలో అడ్వాన్సులు దాదాపు 21 శాతం పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు దాదాపు 6 శాతం నష్టపోయింది. 



You may be interested

రీరేటింగ్‌ దిశగా టెల్కోలు

Thursday 10th October 2019

చార్జీల పెంపు పాజిటివ్‌ అంటున్న బ్రోకరేజ్‌లు రిలయన్స్‌ జియో తాజాగా ఐయూసీ చార్జీలను సాకుగా చూపి అవుట్‌గోయింగ్‌ చార్జీలను(ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై) వసూలు చేయాలని నిర్ణయించింది. ఇది కంపెనీ ఆదాయం, ఎబిటాలను ప్రోత్సాహమిచ్చే పాజిటివ్‌ చర్యని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. ఇదే బాటలో ఇతర కంపెనీలు కూడా పయనిస్తాయని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే 2021 ఆర్థిక సంవత్సరానికి టెల్కోల ఎబిటా దాదాపు 16- 17 శాతం మేర పెరగవచ్చని యాక్సిస్‌

బ్యాంకింగ్‌ షేర్ల దెబ్బ... నష్టాల ముగింపు

Thursday 10th October 2019

క్రితం రోజు భారీగా ర్యాలీ జరిపిన బ్యాంకింగ్‌ షేర్లలో గురువారం అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 297 పాయింట్ల నష్టంతో 37,880 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 79 పాయింట్ల క్షీణతతో 11,235 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ప్రధాన సూచీల్లో అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్ల నష్టం కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ 770 పాయింట్లు (2.7) శాతం పతనమయ్యింది. తాజాగా ఫలితాలు వెల్లడించిన

Most from this category