News


ఇండస్‌ఇండ్‌ లాభంలో 62 శాతం క్షీణత

Wednesday 22nd May 2019
news_main1558515345.png-25887

మార్చి త్రైమాసికానికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు నికరలాభం భారీగా పతనమైంది. క్యు4లో బ్యాంకు లాభం 62.21 శాతం క్షీణించి రూ. 360.10 కోట్లకు చేరింది. ప్రొవిజన్స్‌ ఐదు రెట్లు పెరగడం నికరలాభంపై తీవ్ర ‍ప్రభావం చూపింది. గత క్యు4లో బ్యాంకు రూ. 953.09 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ. 1561 కోట్లను చేరాయి. గత క్యు4లో ఈ కేటాయింపులు రూ. 335 కోట్లు కావడం గమనార్హం.

సమీక్షా కాలంలో బ్యాంకు ఎన్‌ఐఐ రూ. 2232 కోట్లను చేరింది. ఈ సమయంలో బ్యాంకు అసెట్‌ క్వాలిటీ బాగా దెబ్బతిన్నది. క్యు4లో బ్యాంకు జీఎన్‌పీఏ 2.10 శాతానికి, నికర ఎన్‌పీఏ 1.21 శాతానికి పెరిగాయి. గత క్యు4లో స్థూల ఎన్‌పీఏ 1.17 శాతం, నికర ఎన్‌పీఏ 0.51 శాతం ఉండగా, గత క్యు3లో స్థూల ఎన్‌పీఏ 1.13 శాతం, నికర ఎన్‌పీఏలు 0.59 శాతంగా ఉన్నాయి. ఒక్కో షేరుపై రూ. 7.50 డివిడెండ్‌ను బ్యాంకు ప్రకటించింది. మధ్యాహ్న సమయానికి బ్యాంకు షేర్లు 5 శాతం లాభంతో రూ.1520 వద్ద ట్రేడవుతున్నాయి. 

 



You may be interested

1శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 22nd May 2019

మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంక్‌ నిప్టీ భారీగా లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్ల ర్యాలీతో నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.20శాతం లాభపడి 30,675.10ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5శాతం లాభపడింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.50 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఎస్‌బీఐ 1శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌

టెక్‌ మహీంద్రా షేరును ఏం చేద్దాం?

Wednesday 22nd May 2019

మార్చి త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా నికర లాభం దాదాపు 9 శాతం క్షీణించింది. కానీ ప్రముఖ బ్రోకరేజ్‌లు కంపెనీ షేరుపై పాజిటివ్‌గానే ఉన్నాయి.  1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌ పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 950 నుంచి రూ. 910కి తగ్గించింది. క్యు4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. టెలికం వ్యాపారం బాగుంది. హువావేపై నిషేధం కంపెనీపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. ఈపీఎస్‌ అంచనాలు 3 శాతం మేర తగ్గింపు.  2. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌

Most from this category