ఇండస్ఇండ్ లాభంలో 38 శాతం వృద్ధి
By D Sayee Pramodh

జూన్ త్రైమాసికానికి ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 38.30 శాతం పెరిగి రూ. 1432.50 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 1036 కోట్ల లాభం ప్రకటించింది. బ్యాంకు క్యు1లో రూ. 1181 కోట్ల లాభం ప్రకటించవచ్చని మార్కెట్ అంచనా వేసింది. క్యు1లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం అంచనాలకు దాదాపు అనుగుణంగా రూ. 2844 కోట్లుగా నమోదయింది. ఇదే సమయంలో స్థూల ఎన్పీఏలు 2.1 శాతం నుంచి 2.15 శాతానికి, నికర ఎన్పీఏలు 1.20 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగాయి. మొండిపద్దుల కేటాయింపులు గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 430.60 కోట్లను చేరాయి. భారత్ ఫైనాన్షియల్స్‌ను విలీనం చేసుకోవడం వల్ల తాజా ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకు క్యు1లో ఎలాంటి రైటాఫ్‌లు ప్రకటించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం క్రెడిట్ వ్యయాలు 60-70 బీపీఎస్ ఉండొచ్చని బ్యాంకు అంచనా వేసింది. మధ్యాహ్నానికి బ్యాంకు షేర్లు స్వల్ప ఊగిసలాటలో రూ. 1545కు అటుఇటుగా కదలాడుతోంది.
You may be interested
ఆద్యంతం ఊగిసలాట... నష్టాల ముగింపు
Friday 12th July 2019ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు శుక్రవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ముగిశాయి. సెన్సెక్స్ 86.88 పాయింట్ల నష్టంతో 38,736.23 వద్ద, నిఫ్టీ 30.40 పాయింట్లును కోల్పోయి 11,552.50 వద్ద స్థిరపడింది. నేడు మార్కెట్ ముగింపు అనంతరం దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాలను వెల్లడితో పాటు, మే మాసపు ఐఐపీ గణాంకాలు, జూన్ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు విడుదల కానుడంటంతో
టాటా మోటర్స్ రికవరీ
Friday 12th July 2019టాటా మోటర్స్ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.156.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ అమ్మకాలు జూన్‌లో 5శాతం క్షీణించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో నేటి ఉదయం మార్కెట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై దాదాపు 2శాతం నష్టపోయి రూ.153.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మార్కెట్ రివకరిలో భాగంగా షేర్లు తిరిగి లాభాల్లో