News


ఇండస్‌ఇండ్‌లో హిందూజాల పెట్టుబడులు .2,700 కోట్లు

Monday 24th June 2019
news_main1561358093.png-26525

 ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లయిన హిందూజాలు రూ.2,700 కోట్లను వారెంట్ల ద్వారా పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ బ్యాంక్‌లో భారత ఫైనాన్స్‌ విలీనం తర్వాత ప్రమోటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్ట్రాటజీ హెడ్‌ సంజయ్‌ మాలిక్‌ అన్నారు.‘బ్యాంక్‌లో తమ వాటాను 15 శాతానికి తిరిగి పెంచుకునేందుకు మా ప్రమోటర్లు రూ.2,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు’ అని ఆయన వివరించారు. నాల్గవ వంతు నగదును  విలీనం తర్వాత, మిగిలిన నగదు 18 నెలల్లో ఏర్పాటుచేయనున్నారని తెలిపారు. భారత ఫైనాన్స్‌తో విలీనం తర్వాత ప్రమోటర్ల వాటా 13 శాతానికి తగ్గిందని వారెంట్‌ ఇష్యూ ద్వారా 15 శాతానికి పెంచుకొడానికి అవకాశం దొరికిందని అన్నారు. షేరుకు రూ. 1,709 చొప్పున ప్రమోటర్లు కొనుగోలు చేయనున్నారు. శుక్రవారం ఇండ్‌స్‌ఇండ్‌ షేరు బీఎస్‌ఈలో రూ.1,448.70 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 
      ఇండ్‌స్‌ఇండ్‌ బ్యాంక్‌లో భారత ఫైనాన్స్‌ విలీన ప్రకటన 2017 అక్టోబర్‌లో వెలువడింది. ప్రతి 1000 భారత ఫైనాన్స్‌ షేర్లకు 639 ఇండస్‌ఇండ్‌ షేర్లను వాటాదారులు పొందనున్నారు. ప్రమోటర్ల పెట్టుబడి పెట్టే నగదుతో పాటు బ్యాంక్‌లోకి రూ.4,200 కోట్ల నికర విలువ కలిగిన భారత్‌ఫైనాన్స్‌ విలీనం అవ్వడం కూడా మార్కెట్‌ క్యాప్‌ను పెంచనుందని మాలిక్‌ అన్నారు. దీనితో కంపెనీ క్యాపిటల్‌ బేస్‌ 100కోట్ల డాలర్లకు పెరగనుందని, నగదు లభ్యత  3బేసిస్‌ పాయింట్లు మెరుగుపడవచ్చని వివరించారు. ఈ పెట్టుబడుల కారణంగా నికర వడ్డి లాభాలు 0.30 శాతం మేర పెరగనున్నాయని, అంతే కాకుండా ఆస్తి, ఈక్విటీలపై లాభాలు కూడా పెరగనున్నయని అన్నారు. మార్చి త్రైమాసికంలో 3.9 శాతం లాభాలను బ్యాంక్‌ ప్రకటించిందని జూలై 12 న జూన్‌ త్రైమాసికపు లెక్కలను ప్రకటించనుందని తెలిపారు. ఈ విలీనం వలన ఆస్తి, ఈక్విటీలపై వచ్చే లాభాలు పెరగనున్నాయి. ఆస్తులపై వచ్చే లాభాలు ఇండస్‌ఇండ్‌వి 1.9 శాతం ఉండగా ,భారతఫైనాన్స్‌ లాభాలు 4.5శాతంగా ఉన్నాయి. అదే విధంగా ఈక్విటీ లాభాలు భారత ఫైనాన్స్‌వి 27 శాతం ఉండగా, బ్యాంక్‌వి 17.5 శాతం ఉన్నాయి. ‘భారత ఫైనాన్స్‌తో సంబంధాలు, ఉద్యోగులలో ఎటువంటి మార్పు లేకుండా బ్యాంక్‌కు అనుబంధ సంస్థగా, వ్యాపార భాగస్వామిగా తన సేవలను అందిస్తు‍్ంది. భారత ఫైనాన్స్‌ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌తో చాలా కాలం నుంచి వ్యాపార భాగస్వామిగా పనిచేయటంతో విలీనంలో ఎటువంటి ఇబ్బందులుండవు.  ఈ విలీనంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ సేవలను అందించగలుగాతం’ అని మాలిక్‌ తెలిపారు. You may be interested

విరాల్‌ నిష్క్రమణతో మరో 25బీపీఎస్‌ రేట్‌కట్‌?!

Monday 24th June 2019

నోమురా అంచనా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. మరో ఆరునెలల కాలపరిమితి ఉండగానే ఆయన పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కేంద్రబ్యాంకులో రేట్ల తగ్గింపుపై నెలకొన్న వైరుధ్యాలే విరాల్‌ రాజీనామాకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. మానిటరీ పాలసీ, ఎకనమిక్‌అండ్‌ పాలసీ రిసెర్చ్‌ శాఖలకు విరాల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేవారు. ప్రభుత్వానికి, ఆయనకు ఆర్‌బీఐ స్వతంత్రత విషయంలో విబేధాలు ఉన్నాయి.

మొబైల్‌ యాప్స్‌ నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌

Monday 24th June 2019

స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, ఎన్‌పీఎస్‌ ఎన్నో సేవలను ఆఫర్‌ చేస్తున్న సంస్థలు వీటిని ఎంచుకునే ముందు స్వీయ పరిశీలన తప్పనిసరి పారదర్శకత, పాటించే ప్రమాణాలను పరిశీలించాలి అన్ని వివరాలను వెల్లడించే సంస్థలను పరిశీలించొచ్చు ప్రాథమిక అవగాహన లేని వారు జాగ్రత్తలు తీసుకోవాలి   ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎంత సులభమో... ఇన్వెస్ట్‌ చేయడాన్ని కూడా అంత సులభతరం చేస్తున్నాయి కొన్ని మొబైల్‌ అప్లికేషన్లు (యాప్స్‌). ఎన్నో స్టార్టప్‌ సంస్థలు ఇలా వివిధ లక్ష్యాలకు సంబంధించిన యాప్స్‌తో యూజర్ల ముందుకు వచ్చేస్తున్నాయి.

Most from this category