News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లో బీఎఫ్‌ఐఎల్‌ విలీనం

Thursday 20th June 2019
news_main1561016633.png-26443

రికార్డ్‌ డేట్‌ వచ్చే నెల 4  న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (బీఎఫ్‌ఐఎల్‌) విలీనం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఇరు కంపెనీలు తమ తమ వాటాదారులకు, రుణదాతలకు సమాచారమిచ్చాయి. అదే రోజును రికార్డ్‌ డేట్‌గా కూడా పరిగణిస్తామని పేర్కొన్నాయి. ఆ రోజు నాటికి ఎవరైతే బీఎఫ్‌ఐఎల్‌ వాటాదారులుగా ఉంటారో వారికి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌​ షేర్లు లభిస్తాయి. ప్రతి 1,000 బీఎఫ్‌ఐఎల్‌ షేర్లకు 639 ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను (గతంలో ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌) విలీనం చేసుకోవాలని గత ఏడాది అక్టోబర్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. 



You may be interested

తేరుకుంటున్న ఏసియన్‌ పెయింట్స్‌

Thursday 20th June 2019

అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్ఏ, ఎసియన్‌ పెయింట్స్‌ షేర్ల టార్గెట్‌ ధరను రూ. 1,285కు తగ్గించింది. ఇది ఇప్పుడున్న స్థాయికంటే 7 శాతం తక్కువ. రేటింగ్‌ను మాత్రం ‘అమ్మొచ్చు’గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో  ఏసియన్‌ పెయిం‍ట్స్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 1.5 శాతం నష్టపోయింది. అయితే మధ్యాహ్న సమయానికి కోలుకున్న ఎసీయన్‌ పెయింట్స్‌ షేరు బీఎస్‌ఈలో 0.60శాతం లాభంతో రూ.1,390గా ట్రేడవుతోంది. ‘ఏసియన్‌ పెయింట్స్‌ ఫ్రీ క్యాష్‌ ఫ్లో(ఎఫ్‌సీఎఫ్‌) పెరిగినప్పటికి

విండోస్‌ 7కు అప్‌డేట్స్‌ నిలిపివేత

Thursday 20th June 2019

- వచ్చే ఏడాది జనవరి 14 నుంచి అమల్లోకి జైపూర్:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 14 నుంచి అప్‌డేట్స్‌ను నిలిపేస్తామని, యూజర్లు మెరుగైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారాల్సి ఉంటుందని పేర్కొంది. యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో  పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్‌,

Most from this category