News


క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో

Tuesday 26th November 2019
news_main1574738234.png-29847

హైదరాబాద్‌లో ఇన్‌డ్రైవర్‌ సేవలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్‌, పీక్‌టైం, సర్జ్‌ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ‘ఇన్‌డ్రైవర్‌’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్‌ నుంచి ఎలాంటి కమిషన్‌ తీసుకోదు. కస్టమర్‌ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి. ఇదెలా పని చేస్తుందంటే.. కస్టమర్‌ తాను ఎక్కవలసిన, దిగాల్సిన స్థలం నిర్దేశిస్తూ ఎంత చెల్లించేదీ యాప్‌లో సూచించాలి. సమీపంలో ఉన్న డ్రైవర్లకు ఈ సమాచారం వెళ్తుంది. కస్టమర్‌ చెల్లించదల్చుకున్న మొత్తం నచ్చకపోతే డ్రైవర్‌ బేరమాడవచ్చు. హైదరాబాద్‌లో 2,000 మంది డ్రైవర్లతో చేతులు కలిపామని ఇన్‌డ్రైవర్‌ ఇండియా పీఆర్‌ మేనేజర్‌ పవిత్‌ నందా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. బేస్‌ ఫేర్‌ రూ.40గా నిర్ణయించామన్నారు. ఆరు నెలల తర్వాత డ్రైవర్ల నుంచి 5-10 శాతం కమీషన్‌ తీసుకుంటామని చెప్పారు. 



You may be interested

చెల్లించాల్సింది రూ.25-30 కోట్లు

Tuesday 26th November 2019

వారంలోగా తిరిగి చెల్లించేస్తాం కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) తన కస్టమర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25-30 కోట్ల వరకూ ఉంటాయని కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి వెల్లడించారు. వీటిని రెండు వారాలు లేదా అంతకన్నా ముందే చెల్లించేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఇవి దాదాపు

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా

Tuesday 26th November 2019

- బోర్డు పునర్‌వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీఈఈఎల్‌) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్‌ వివరించింది. ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్‌వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్‌ గోపాలన్‌, సురేంద్ర

Most from this category