News


అనంతపురంలో 30 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌

Friday 3rd January 2020
Markets_main1578021361.png-30629

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబైకి చెందిన గ్రేడ్‌–ఏ ఇండస్ట్రియల్, లాజిస్టిక్‌ పార్క్స్‌ డెవలపర్‌ ఇండోస్పేస్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో 30 ఎకరాల్లో  భారీ లాజిస్టిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది బెంగళూరు – హైదరాబాద్‌ జాతీయ రహదారి–44కు సమీపంలో ఉండటంతో పాటూ కృష్ణపట్నం నౌకాశ్రయానికి కనెక్టివిటీతో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇండోస్పేస్‌ను సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తుంది.
గుజరాత్, హర్యానాలో కూడా..
అనంతపురంతో పాటూ గుజరాత్‌లోని బెచరాజీ మండల్‌ స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌లో 40 ఎకరాల్లో, హర్యానాలోని సోహ్న టౌరూలో 50 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌ వైస్‌ చైర్మన్‌ రాజేశ్‌ జగ్గి తెలిపారు. ప్రస్తుతం ఇండోస్పేస్‌కు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి తొమ్మిది రాష్ట్రాల్లో 3.45 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 34 ఇండస్ట్రియల్, లాజిస్టిక్‌ పార్క్‌లున్నాయి. దీర్ఘకాలంలో 12 కోట్ల చ.అ.లకు విస్తరించాలన్నది కంపెనీ లక్ష్యం. 



You may be interested

అమెరికా దాడులు...ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020

 ఇరాక్‌ విమానాశ్రయంపై అమెరికా మిలటరీ దాడులు నిర్వహించి, ఇరాన్‌, ఇరాక్‌ సైనికాధికారులను కాల్చివేయడంతో హఠాత్తుగా ఆసియా స్టాక్‌ సూచీలు పడిపోయిన నేపథ్యంలో నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు 40పాయింట్ల నష్టంతో 12,300 పాయింట్ల  వద్ద కదులుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,339 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను

ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ ఈ మార్చిలోగా లేనట్లే!

Friday 3rd January 2020

కంటైనర్‌ కార్పొల్లో కూడా  దీపమ్‌ ఉన్నతాధికారి వెల్లడి  ముంబై: ఎయిర్‌ ఇండియాలో వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చు. ఎయిర్‌ ఇండియాతో పాటు బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ల్లో కూడా వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కాకపోవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం వెనకబడి ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా.  వాటా విక్రయ ప్రయత్నాల్లో జాప్యం... ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

Most from this category