అవన్నీ నిరాధార ఆరోపణలే
By Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గవర్నెన్స్ పరమైన లొసుగులున్నాయంటూ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన ఆరోపణలను మరో ప్రమోటరు రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజేస్ (ఐజీఈ) ఖండించింది. ఇవన్నీ పసలేని ఆరోపణలేనని వ్యాఖ్యానించింది. ఇండిగో 'పాన్‌షాపు' కన్నా అధ్వాన్నంగా తయారైందంటూ గంగ్వాల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'పాన్‌షాపు' సమర్ధులైన అధికారుల సారథ్యంలో చక్కగానే పనిచేస్తోందని, ఆర్థికంగా పటిష్టంగానే ఉందని స్పష్టం చేసింది. సంస్థలో ఎక్కడా అధికార దుర్వినియోగాలు జరగలేదని పేర్కొంది. అత్యవసర సాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేయాలన్న గంగ్వాల్ ప్రతిపాదనను న్యాయ సలహా మేరకే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్టు తిరస్కరించిందని ఐజీఈ తెలిపింది.
"కార్పొరేట్ గవర్నెన్స్ అంటే నిరాధార ఆరోపణలు చేయడం కాదు. కంపెనీతో పాటు దానితో సంబంధమున్న వారందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. (గంగ్వాల్) పాన్షాపుగా అభివర్ణించిన ఇండిగో గతంలోనూ బాగానే పనిచేసింది. మెరుగ్గానే రాణిస్తోంది. ఆర్థికంగా పటిష్టంగా ఉంది. సమర్ధులైన మేనేజర్ల సారథ్యంలో చక్కగా నడుస్తోంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ గంగ్వాల్ చేస్తున్న ఆరోపణలన్నీ పసలేనివే " అని ఒక ప్రకటనలో పేర్కొంది. అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపిస్తున్న గంగ్వాల్.. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని వ్యాఖ్యానించింది. 2006లో పెట్టుబడులు పెట్టినప్పటికీ 2015లో గానీ కంపెనీ బోర్డులో గంగ్వాల్ చేరలేదని, అప్పటిదాకా ఆయన లేకున్నప్పటికీ ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలతోనే ఇండిగో గొప్ప సంస్థగా ఎదిగిందని పేర్కొంది.
You may be interested
రెండోరోజూ రికార్డు ముగింపే..
Saturday 13th July 2019ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడటంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండోరోజూ రికార్డు గరిష్ట స్థాయిలోనే ముగిశాయి. రెండురోజుల కిత్రం అమెరికా కాంగ్రెస్ ఎదుట ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగిస్తూ ‘‘తయారీ రంగ మందగమనం, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇంకా ముప్పు పొంచి ఉంది. సెంట్రల్ బ్యాంక్ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది’’ అన్నారు. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్
జపాన్ను మించనున్న భారత్
Saturday 13th July 20192025 నాటికి అతి పెద్ద ఎకానమీల్లో 3వ స్థానం ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో భారత్ శరవేగంగా ముందుకెడుతోంది. ఈ ఏడాది బ్రిటన్ను తోసిరాజని అయిదో స్థానాన్ని దక్కించుకోనుంది. ఇక 2025 నాటికి జపాన్ను దాటి మూడో అతి పెద్ద ఎకానమీగా అవతరించనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. "2019లో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద