News


రూ.999లకే విమాన టికెట్‌

Wednesday 12th February 2020
news_main1581477795.png-31710

  • ఇండిగో వాలెంటైన్స్‌ డే ఆఫర్‌

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్‌ వర్తిస్తుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ వెల్లడించారు. 



You may be interested

రెండో రోజూ లాభాల ఓపెనింగ్‌?!

Wednesday 12th February 2020

గ్యాపప్‌ ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?! ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 35 పాయింట్లు ప్లస్‌ మంగళవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 35 పాయింట్లు ఎగసి 12,163 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,128 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వరుసగా

టైటన్‌ చేతికి హగ్‌ ఇన్నోవేషన్స్‌

Wednesday 12th February 2020

కంజ్యూమర్‌ గూడ్స్‌ రంగ సంస్థ టైటన్‌ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్‌ కంపెనీ హగ్‌ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్‌ ఫౌండర్‌ రాజ్‌ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్‌ వాచెస్‌, వేరబుల్స్‌ విభాగం సీఈవో ఎస్‌.రవికాంత్‌ తెలిపారు. కాగా, కనెక్టెడ్‌ ఎక్స్‌ పేరుతో టైటాన్‌ ఫుల్‌ టచ్‌ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. వాచ్‌ ధర రూ.14,995. 

Most from this category