News


రూ.899లకే విమాన టికెట్‌

Tuesday 24th December 2019
news_main1577159821.png-30396

  • భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఇండిగో

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్‌ ఫ్యాట్‌ ఇండిగో సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. డిసెంబర్‌ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ ఈ నెల 26న రాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగియనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుంది. విదేశీ ప్రయాణానికి ప్రారంభ టికెట్‌ ధర రూ. 2,999గా కంపెనీ ప్రకటించింది. ఇండిగో వెబ్‌సైట్‌, యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకుంటే సౌలభ్య రుసుము (కన్వీనియన్స్) లేదని వెల్లడించింది. 



You may be interested

మంగళవారం యాక్టివ్‌ స్టాక్స్

Tuesday 24th December 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ట్రేడింగ్‌లో ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు చూద్దాం.. సొలారా యాక్టివ్‌ ఫార్మా: స్ర్టైడ్స్‌ కెమికల్స్‌ కంపెనీతో విలీన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసినట్లు సొలారా యాక్టివ్‌ ఫార్మా తాజాగా పేర్కొంది. చాలెట్‌ హోటల్స్‌: హయత్‌ ఇండియా కన్సల్టెన్సీతో ఫ్రాంచైజీ, తదితర పలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చాలెట్‌ హోటల్స్‌ తెలియజేసింది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌: దాదాపు 3 కోట్ల క్యుములేటివ్‌ రీడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల(సీపీఆర్‌ఎస్‌) జారీకి అనుమతి

పార్టీ అయినా, పనికి అయినా.. ‘డెనిమ్‌’

Tuesday 24th December 2019

వస్త్రధారణలో సౌకర్యం ఎంపికకు విస్తృతమైన శ్రేణి పని ప్రదేశాల్లో మారుతున్న ధోరణి బోటమ్‌వేర్‌గా జీన్స్‌కు ప్రాధాన్యం దీంతో మందగమనంలోనూ అమ్మకాల్లో వృద్ధి న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్‌ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్‌ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్‌ అయినా.. డెనిమ్‌ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్‌

Most from this category