News


ఇండిగో సమ్మర్‌ ఆఫర్‌ సేల్‌

Wednesday 15th May 2019
news_main1557900579.png-25745

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3-డే సమ్మర్‌ సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుంది. ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-హైదరాబాద్, హైదరాబాద్-దుబాయ్, చెన్నై- కువైట్, ఢిల్లీ-కౌలాలంపూర్, బెంగళూరు-మాల్దీవ్‌ రూట్లలో ఆఫర్‌ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ మాట్లాడుతూ.. ‘వేసవి సెలవులు మొదలవడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించాం. మే16 వరకు జరిగే బుకింగ్స్‌పై ఆఫర్‌ వర్తిస్తుంది’ అని అన్నారు. ప్రీ-పెయిడ్‌ అధిక బ్యాగేజీపై 30 శాతం వరకు డిస్కౌంట్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. You may be interested

క్యాష్‌బ్యాక్ మోసం @ రూ. 10 కోట్లు

Wednesday 15th May 2019

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వాట్సాప్‌పై యూటర్న్ ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. "దీపావళి తర్వాత

కూరగాయల ధరల మంట!

Wednesday 15th May 2019

కూరగాయల ధరల మంట!  ఏప్రిల్‌లో  ఏకంగా 40.65 శాతం పెరిగిన టోకు ధరలు సూచీ మొత్తం చూస్తే, ద్రవ్యోల్బణం 3.07 శాతం 2018 ఏప్రిల్‌లో 3.62 శాతం ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు ఓకే న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్‌ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్‌ ధరలతో పోల్చి) పెరిగాయి. అయితే మొత్తంగా  టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యో‍ల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే,  ఏప్రిల్‌లో

Most from this category