News


ఇండిగోకు ఐఏటీఏలో సభ్యత్వం

Thursday 31st October 2019
news_main1572493006.png-29249

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా.. వీటిలో 60 దేశీయ, 23 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. మొత్తం 247 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సంస్థ కలిగిఉంది. ఇక ఐఏటీఏ 290 ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలోనే స్పైస్‌జెట్‌ ఈ సంఘంలో సభ్యత్వం పొందిన తొలి భారత చౌక చార్జీల విమానయాన సంస్థగా నమోదైంది. ఆ తరువాత మూడు నెలలకాలంలోనే ఆ సంస్థ చైర్మన్‌ అజయ్ సింగ్ సంఘం బోర్డులోకి ఎన్నికయ్యారు.  



You may be interested

మరో గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 31st October 2019

రెండు రోజులుగా భారీ లాభాల్ని ఆర్జించిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 40,211 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,895 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరో పావుశాతం తగ్గించడంతో గత రాత్రి అమెరికా ఎస్‌ అండ్‌ పీ-500 సూచి సరికొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో తగ్గనున్న టాటా వాటా

Thursday 31st October 2019

19.7 నుంచి 14.7 శాతానికి చేరిక నియంత్రణల నేపథ్యంలో తాజా నిర్ణయం నిర్వహణ బాధ్యత జీఎంఆర్‌ చేతిలోనే హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో టాటా గ్రూప్‌ ప్రతిపాదిత వాటా కొనుగోలు డీల్‌ను పునర్‌వ్యవస్థీకరించినట్టు సమాచారం. నియంత్రణ పరమైన అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా గ్రూప్‌ నేతృత్వంలోని మూడు సంస్థలు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో 44.4 శాతం వాటాను రూ.8,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు జీఎంఆర్‌తో డీల్‌

Most from this category