News


ఇండిగో విమానాలకు సీఎఫ్‌ఎం ఇంజిన్లు

Tuesday 18th June 2019
news_main1560839575.png-26378

  • 20 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆర్డరు

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్‌-1ఏ ఇంజిన్లను వినియోగించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆ ఇంజిన్లను తయారు చేసే సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ సంస్థకు 20 బిలియన్ డాలర్ల ఆర్డరిచ్చింది. ప్రస్తుతం ఇండిగో నిర్వహిస్తున్న ఏ320నియో రకం విమానాలు చాలా మటుకు  ప్రాట్‌ అండ్ విట్నీ ఇంజిన్లతో నడుస్తున్నాయి. అయితే కొన్నాళ్లుగా వీటిల్లో లోపాల కారణంగా తీవ్ర సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రాట్ అండ్ విట్నీకి పోటీ సంస్థ అయిన సీఎఫ్‌ఎం ఇంజిన్ల వైపు ఇండిగో మొగ్గు చూపింది. ఒకే ఆర్డర్లో ఇంత పెద్ద ఎత్తున ఇంజిన్లను కొనుగోలు చేయడం ఒక రికార్డని ఇండిగో తెలిపింది. లీప్‌-1ఏ ఇంజిన్‌తో తయారైన ఏ320నియో విమానం 2020లో తమకు అందుబాటులోకి రావచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇండిగోకు 230 విమానాలు ఉన్నాయి. 



You may be interested

మేలో నియామకాల వృద్ధి 11 శాతం

Tuesday 18th June 2019

 ఐటీలో పెరిగిన ఉద్యోగాలు న్యూఢిల్లీ: దేశీయంగా గతనెల్లో ఉద్యోగుల నియామకాలు 11 శాతం వృద్ధి చెందినట్టు నౌకరీ డాట్‌ కామ్‌ వెల్లడించింది. ఈ సంస్థ నిర్వహించే నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌.. మే నెల్లో 2,346 వద్దకు చేరుకుంది. గతేడాది ఇదేకాలంలో 2,106 ఉండగా.. ఏడాది ప్రాతిపదికన పదకొండు శాతం వృద్ధిని నమోదుచేసింది. ఐటి-సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగాలు ఈ సూచీని ఇంతటి స్థాయికి చేర్చినట్లు వెల్లడించింది. ఈ రంగంతో పాటు

భారతీ ఆక్సా జనరల్‌కు లాభాలు

Tuesday 18th June 2019

ప్రీమియం ఆదాయంలో 29 శాతం ప్రగతి ముంబై: భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభాలను ఆర్జించినట్టు ప్రకటించింది. ప్రీమియం వసూళ్లలో 29 శాతం వృద్ధిని సాధించామని, ఇది పరిశ్రమ వృద్ధి రేటు కంటే ఎక్కువని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల రిటన్‌ ప్రీమియం (జీడబ్ల్యూపీ) రూ.2,285 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సంలో ఇది రూ.1,772 కోట్లుగా ఉంది. అన్ని రకాల బీమా

Most from this category