ఇండిగో ‘వేసవి ప్రత్యేక ఆఫర్’
By Sakshi

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.999కే టికెట్ అందిస్తోంది. జూన్ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుండగా.. జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ మాట్లాడుతూ.. ‘గతనెల్లో ఇచ్చిన ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి అద్భుత సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 4-రోజుల ప్రత్యేక వేసవి ఆఫర్‌ను ప్రకటించాం. ఈ సారి వేసవి దాటిన తరువాత కూడా ప్రయాణికుల రద్ధీ అధికంగానే ఉంటుందని భావిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన వారిని దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు ఇచ్చే టికెట్ చార్జీలను సరసమైన ధరలకే అందిస్తున్నాం’ అని అన్నారు.
You may be interested
రుణాలన్నీ తీర్చేస్తాం
Wednesday 12th June 2019భవిష్యత్తుల్లో రుణాలన్నీ తీర్చేస్తాం గ్రూపు రుణభారాన్ని తగ్గించుకుంటాం వదంతుల వల్లే షేర్ల పతనం: అనిల్ అంబానీ తీర్పుల్లో జాప్యమూ కారణమేనని ఆరోపణ న్యూఢిల్లీ/ముంబై: భవిష్యత్తులో అన్ని రకాల రుణ చెల్లింపులను సకాలంలో తీర్చివేసేందుకు కట్టుబడి ఉన్నామని అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. గడిచిన 14 నెలల కాలంలో రూ.35,000 కోట్ల రుణాలను చెల్లించినట్టు చెప్పారు. తమ గ్రూపు రుణ భారాన్ని కనీస స్థాయికి తగ్గించుకోనున్నట్టు తెలియజేశారు. రూ.లక్ష కోట్ల భారీ రుణ భారం
రుణ రేట్లను స్వల్పంగా తగ్గించిన ఓబీసీ
Wednesday 12th June 2019న్యూఢిల్లీ: ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మంగళవారం తన ఏడాది రుణ రేటు (ఎంసీఎల్ఆర్- నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు)ను స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ రేటు 8.70 శాతానికి తగ్గింది. జూన్ 11 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. కస్టమర్ల గృహ, ఆటో, వ్యక్తిగత రుణ రేటు సాధారణంగా ఏడాది రేటుకు