News


పర్యాటక రంగం.. 50 బిలియన్‌ డాలర్లు

Friday 20th December 2019
news_main1576812774.png-30323

2022 నాటికి సాధించాలన్న అమితాబ్‌కాంత్‌
న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్‌ అమితాబ్‌ కాంత్‌ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్‌ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

Friday 20th December 2019

నెక్సాన్‌ ఈవీ.. మూడు వేరియంట్లలో లభ్యం  ఒక్క సారి చార్జింగ్‌.. 300 కిమీ. ప్రయాణం  ధర రూ.15-17 లక్షల రేంజ్‌లో  ముంబై: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, నెక్సాన్‌ ఈవీని గురువారం ఆవిష్కరించింది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు కంటే ఎక్కువగానే ప్రయాణించే ఈ వాహన విక్రయాలను మరికొన్ని వారాల్లోనే ప్రారంభిస్తామని టాటా మోటార్స్‌ తెలిపింది. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని 9.9 సెకన్లలోనే ఈ వాహనం

ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్‌ రుణాలు

Friday 20th December 2019

రూ.96 లక్షల కోట్లకు..: ఐసీఐసీఐ బ్యాంకు ముంబై: ఫైనాన్స్‌ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌, క్రెడిట్‌ కార్డులు) కారణంగా రుణ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు

Most from this category