News


సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రూపంలో విదేశాలకు నల్లధనం తరలింపు

Friday 27th September 2019
news_main1569557069.png-28574

  • అంధేరీలోని ఓ కంపెనీ నిర్వాకం

న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్‌ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు విషయంలో పన్ను అధికారులు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ సాయాన్ని కోరారు. దీంతో మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌కు స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేరషన్‌ (ఎఫ్‌టీఏ) నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా నియమిత వ్యక్తి (నామినేటెడ్‌) వివరాలను సమర్పించాలని కోరింది. సమాచారం పంచుకోవడాన్ని వ్యతిరేకించే హక్కును వినియోగించుకునేందుకే చట్టబద్ధంగా ఈ నోటీసు జారీ చేసింది. జెనీవా బ్రాంచ్‌లో 500 మిలియన్‌ డాలర్లకు పైగా డిపాజిట్లతో అతిపెద్ద భారత ఖాతాదారుగా మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ పేరు ఇటీవలే వెలుగు చూసిన హెచ్‌ఎస్‌బీసీ జాబితాలో ఉండడం గమనార్హం. 



You may be interested

పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల సడలింపు

Friday 27th September 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)పై తన ఆంక్షలను ఆర్‌బీఐ సడలించింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు లోగడ అవకాశం ఇవ్వగా, తాజాగా ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. దీంతో 60 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. ఎందుకంటే వీరి ఖాతాల్లో బ్యాలన్స్‌ రూ.10,000లోపే ఉంటుంది. వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) అధికంగా ఉండడం, నిబంధనల ఉల్లంఘనను గుర్తించడంతో

70.95 వద్ద రూపీ ప్రారంభం

Friday 27th September 2019

దేశీయ కరెన్సీ రూపీ,  డాలర్‌ మారకంలో శుక్రవారం 7 పైసలు బలహీనపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా చైనాతో వాణిజ్య ఒప్పందం అనుకున్న సమయం కంటే ముందే ఏర్పడే వీలుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 16 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీంతోపాటు గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు  పాజిటివ్‌గా ట్రేడవ్వడం,

Most from this category