News


శ్రీమంతులు పెరిగారు!

Friday 6th March 2020
news_main1583473388.png-32321

  • ప్రస్తుతం దేశంలో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ సంఖ్య 5,986
  • 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,534లకు చేరిక
  • ఈక్విటీలే ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్స్‌; ఆ తర్వాత బాండ్లు, రియల్టీలో.. 
  • అత్యంత ఖరీదైన నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు
  • గ్లోబల్‌ నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌–2020 వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, మందగించిన ఆర్థికాభివృద్ధి వంటివి శ్రీమంతుల సంపద వృద్ధికి విఘాతాన్ని కలిగించడం లేదు. ప్రస్తుతం మన దేశంలో 5,986లుగా ఉన్న యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య.. 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,354లకు చేరుతుందని నైట్‌ఫ్రాంక్‌ అంచనా వేసింది. రూ.220 కోట్లకు పైగా నికర సంపద ఉన్న వాళ్లని యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అల్ట్రా శ్రీమంతులున్న దేశం అమెరికా. ఇక్కడ 2,40,575 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలుంటే.. చైనాలో 61,587 మంది, జర్మనీలో 23,078 మంది ఉన్నారు. నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌–2020లోని పలు ఆసక్తికర అంశాలివే..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపద కలిగిన నగరం న్యూయార్క్‌. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లండన్, పారిస్‌ నగరాలు నిలిచాయి. మన దేశం నుంచి ముంబై 44వ స్థానంలో, ఢిల్లీ 58, బెంగళూరు 89వ స్థానంలో నిలిచాయి. 2024 నాటికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంపద కలిగిన కేంద్రంగా ఆసియా నిలుస్తుందని, ఐదేళ్ల వృద్ధి అంచనా 44 శాతం ఉంటుందని నివేదిక తెలిపింది. ఆసియాలో చూస్తే.. 73 శాతం వృద్ధితో ఇండియా మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో 64 శాతంతో వియత్నాం, 58 శాతంతో చైనా, 57 శాతం వృద్ధితో ఇండోనేషియా దేశాలుంటాయని రిపోర్ట్‌ పేర్కొంది. ‘‘ఇండియా ఆర్థికాభివృద్ధికి పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యేనని.. ఇదే సంపద సృష్టికి సహాయపడుతుందని నైట్‌ఫ్రాంక్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ శిషీర్‌ బైజాల్‌ తెలిపారు. ప్రపంచ ఉత్పత్తులు, సేవలకు ఇండియా ప్రధాన మార్కెట్‌గా మారిందని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు ఉత్పాదక కేంద్రంగా మన దేశం అవతరించిందని పేర్కొన్నారు.
ఈక్విటీలే ప్రధాన పెట్టుబడులు..
మన దేశంలోని మొత్తం యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలలో 83 శాతం మంది ఈక్విటీల్లో, 77 శాతం మంది బాండ్లలో, 51 శాతం మంది ప్రాపర్టీల్లో పెట్టుబడులు ఆసక్తిగా ఉన్నారు. 2019లో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ విభాగాల వారీగా చూస్తే.. 29 శాతం ఈక్విటీల్లో, 21 శాతం బాండ్లలో, 20 శాతం రియల్‌ ఎస్టేట్‌లో, 7 శాతం బంగారం, ఇతర ఆభరణాల్లో పెట్టుబడులు పెట్టారు. 2019లో తొలిసారిగా లగ్జరీ పెట్టుబడుల సూచికలో హ్యాండ్‌బ్యాంగ్స్‌ ఎంట్రీ ఇచ్చాయి. లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్‌ 13 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఉన్నాయి. ‘‘గ్లోబల్‌ ఎకానమీ మందగమనం, వాణిజ్య యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు, కొరవడిన పారదర్శకత, అవినీతి, ప్రతికూల వడ్డీ రేట్లు, ఎక్స్‌ఛేంజ్‌ రేట్లు, బ్రెగ్జిట్, వాతావరణ మార్పులు ఇవే యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయని’’ నైట్‌ఫ్రాంక్‌ గ్లోబల్‌ హెడ్‌ (రీసెర్చ్‌) లియామ్‌ బెయిలీ తెలిపారు.
ఏడున్నర కోట్లు @ 102 చ.మీ. స్థలం
2018 డిసెంబర్‌ నుంచి 2019 డిసెంబర్‌ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ ధరల వృద్ధిలో మన దేశం నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలు చోటు దక్కించుకున్నాయి. ప్రైమ్‌ ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ ఇండెక్స్‌ (పీఐఆర్‌ఐ)లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, పోర్చుగల్‌లోని లిస్బన్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ వార్షిక నివాస వృద్ధి రేట్లు వరుసగా 10.3 శాతం, 9.6 శాతంగా ఉన్నాయి. ఢిల్లీలో వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం, బెంగళూరులో 2.1 శాతం, ముంబైలో 0.5 శాతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరం పశ్చిమ యూరప్‌లోని మోనాకో. ఇక్కడ మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7.5 కోట్లు)తో కొనగలిగే స్థలం కేవలం 16.4 చదరపు మీటర్ల (చ.మీ.). అదే మన దేశంలోని లగ్జరీ మార్కెట్లయిన ఢిల్లీలో 197 చ.మీ., ముంబైలో 102.2 చ.మీ., బెంగళూరులో 336 చ.మీ. స్థలం వస్తుంది. You may be interested

27 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Friday 6th March 2020

ఈ నెల 16న స్టాక్‌ మార్కె‍ట్లో లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెల 2న మొదలై గురువారం ముగిసిన ఈ ఐపీఓ 27 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, ఈ ఐపీఓ విశేషంగా విజయవంతం కావడం విశేషం. గత 12 ఏళ్లలో ఈ

నేటి వార్తల్లోని షేర్లు

Friday 6th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(సీడీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయటికి వస్తున్నట్లు జిందాయ్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) వెల్లడించింది. రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌): రైట్స్‌లో ఉన్న 2.38 శాతం ప్రభుత్వ వాటాను సెంకండరీ మార్కెట్‌ ద్వారా ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటిదాక రైల్వే కంపెనీ రైట్స్‌ మొత్తం ఈక్విటీలో 7.83 శాతం  వాటాను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది. ఎన్‌టీపీసీ: ఈ కంపెనీలోని 3.12 శాతం వాటాను

Most from this category