STOCKS

News


ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల

Monday 23rd December 2019
news_main1577070766.png-30364

  • నవంబర్‌లో 2.8 శాతం క్షీణత

న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్‌ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. ఇక అంతర్జాతీయంగా కూడా గత నెల్లో ఉక్కు ఉత్పత్తి ఒక శాతం తగ్గింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా మాత్రం నవంబర్‌లో 4 శాతం వృద్ధి రేటును నమోదుచేయడం విశేషం. ఆ దేశం గత నెల్లో 80.287 ఎంటీ ఉత్పత్తిని నమోదుచేసింది. అమెరికా ఉత్పత్తి 2.2 శాతం తగ్గి 7.233 ఎంటీగా ఉంది. 



You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 23rd December 2019

ఓల్టాస్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.650 టార్గెట్‌ ధర: రూ.765 ఎందుకంటే: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. అమెరికా ఆంక్షల కారణంగా చైనాలో యూసీపీ(యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్‌)ల నిల్వలు భారీగా  పేరుకుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోవడంతో ఈ నిల్వలు తగ్గించుకోవడానికి చైనా కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తాయని, ఈ డిస్కౌంట్ల కారణంగా  యూసీపీ విభాగం నిర్వహణ లాభ మార్జిన్లు పెరుగుతాయని

41,850పైన సెన్సెక్స్‌ ర్యాలీ కొనసాగింపు

Monday 23rd December 2019

దేశీయ ఆర్థిక ప్రతికూలాంశాల్ని సైతం లెక్కచేయకుండా... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావం, విదేశీ నిధుల వెల్లువ కారణంగా స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. అయినప్పటికీ, ప్రపంచంలో ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండియా సూచీలు పెరిగింది తక్కువే. అమెరికా ఎస్‌ అండ్‌ పీ500 సూచి 30 శాతం, 50 దేశాలతో కూడి ఎంఎస్‌సీఐ సూచి 24 శాతం చొప్పున ర్యాలీ సాగించగా, నిఫ్టీ–50 సూచి

Most from this category