News


ఏడేళ్ల గరిష్టానికి సేవల రంగం కార్యకలాపాలు

Thursday 6th February 2020
news_main1580961938.png-31546

  • జనవరిలో 55.5కు చేరిక

న్యూఢిల్లీ: భారత సేవల రంగం కార్యకలాపాలు జనవరి నెలలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ డిసెంబర్‌లో ఉన్న 53.3 పాయింట్ల నుంచి జనవరి నెలలో 55.5 పాయింట్లకు చేరుకుంది. జనవరి నెలలో నూతన ఆర్డర్ల రాకతో ఉపాధి కల్పన, వ్యాపార ఆశావహ, సానుకూల మార్కెట్‌ పరిస్థితులకు దోహదపడినట్టు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సంస్థ పేర్కొంది. నూతన ఆర్డర్ల రాక కూడా ఏడేళ్లలోనే ఎంతో విస్తృతితో ఉన్నట్టు తెలిపింది. తాజా ఆర్డర్ల రాక ప్రధానంగా దేశీయంగానే ఉందని, ఎగుమతులు తగ్గినట్టు పేర్కొంది. ఇక, తయారీ, సేవల రంగాలతో కూడిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుడ్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌లో ఉన్న 53.7 నుంచి జనవరిలో 56.3 పాయింట్లకు పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. 



You may be interested

ఆర్‌బీఐ ఏం చేస్తుందో!?

Thursday 6th February 2020

నేడు సమీక్షా సమావేశ ఫలితాలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక సమీక్షా సమావేశం గురువారం ముగియనుంది. ఈ దఫా ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మీటింగ్‌లో మార్కెట్లు రేట్‌ కట్‌ ఆశల్లో ఉండగా, కమిటీ సభ్యులంతా రేట్లు యథాతధంగా ఉంచేందుకు ఓట్‌ చేశారు. ద్రవ్యోల్బణ గణాంకాలను నిశితంగా పరిశీలించాలని, తదుపరి రేట్‌కట్స్‌ను ధరల ఆధారంగా పరిశీలించాలని ఆర్‌బీఐ అప్పుడు భావించింది. అప్పటి

హావెల్స్‌ నూతన శ్రేణి వాటర్‌ ప్యూరిఫయర్లు

Thursday 6th February 2020

హైదరాబాద్‌: ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ కంపెనీ హావెల్స్‌ ఇండియా నూతన శ్రేణి ఆల్కలైన్‌ వాటర్‌ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. మార్కెట్లో చాలా ఆర్‌వో ప్యూరిఫయర్లు 70 శాతం నీటిని వృధా చేస్తాయని, రికవరీ 30 శాతమే ఉంటుందని కంపెనీ సీరియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ సిసోడియా తెలిపారు. వైస్‌ ప్రెసిడెంట్లు శశాంక్‌ శ్రీవాస్తవ్‌, అనిల్‌ శర్మ, బిజినెస్‌ హెడ్‌ వి.మహేందర్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హావెల్స్‌ రూపొందించిన డిలైట్‌

Most from this category