News


అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెరుగుతున్న భారత్‌ పెట్టుబడులు

Monday 19th August 2019
Markets_main1566193942.png-27854

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో భారత పెట్టుబడులు ఇతోధికమవుతున్నాయి. జూన్‌ చివరికి 6 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 162.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అమెరికా ఖజానా విభాగం తాజా గణాంకాలను పరిశీలిస్తే... అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరంగా అగ్ర స్థానంలో జపాన్‌ ఉంది. ఆ దేశ పెట్టుబడులు 1.122 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్లు మేర ఉండగా, ఆ తర్వాత చైనా 1.112 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడుల పరంగా భారత్‌ 162.7 బిలియన్‌ డాలర్లతో 13వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మే చివరికి 156.9 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌ చివరికి 155.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే క్రమంగా పెరిగినట్టు తెలుస్తోంది. 2018 జూన్‌ నాటికి ఉన్న 147.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో పోల్చి చూసుకుంటే సుమారు 10 శాతానికి పైగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక రంగం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న సమయంలోనూ భారత ఎక్స్‌పోజర్‌ అధికం కావడం గమనార్హం. బ్రిటన్‌ 341.1 బిలియన్‌ డాలర్లు, బ్రెజిల్‌ 311.7 బిలియన్‌ డాలర్లు, ఐర్లాండ్‌ 262.1 బిలియన్‌ డాలర్లు, స్విట్జర్లాండ్‌ 232.9 బిలియన్‌ డాలర్లు, లగ్జెంబర్గ్‌ 231 బిలియన్‌ డాలర్లు, కేమాన్‌ఐలాండ్స్‌ 226.6 బిలియన్‌ డాలర్లు, హాంగ్‌కాంగ్‌ 215.6 బిలియన్‌ డాలర్లు, బెల్జియం 203.6 బిలియన్‌ డాలర్లు, సౌదీ అరేబియా 179.6 బిలియన్‌ డాలర్లు, తైవాన్‌ 175.1 బిలియన్‌ డాలర్లతో భారత్‌ కంటే ముందున్నాయి. 



You may be interested

ఐడియాలపై ప్రభుత్వరంగ బ్యాంకుల సమావేశాలు

Monday 19th August 2019

ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకుల నిర్వహణ న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు తమ శాఖల స్థాయిల్లో అధికారులతో తొలి విడత సమాలోచనలు నిర్వహించాయి. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లేందుకు గాను, బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత పటిష్ట పరచాలని, భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఓ నెల రోజుల

అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు

Monday 19th August 2019

9 పట్టణాల్లో అందుబాటు ధరల గృహాల పరిస్థితి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల వద్ద అమ్ముడుకాని అందుబాటు ధరల ఫ్లాట్లు 4.12 లక్షలు ఉన్నట్టు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ తెలిపింది. ఇవన్నీ కూడా రూ.45 లక్షల ధరల్లోపువేనని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచినందున, ఈ

Most from this category