News


2020లో భారత్‌ వృద్ధి 5.3 శాతమే!

Wednesday 18th March 2020
news_main1584500830.png-32540

- ఇంతక్రితం 5.4 శాతం అంచనాకు కోత
- కోవిడ్‌-19 ప్రభావం ఉంటుందని విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ- మూడీస్‌ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్‌-19 ప్రభావాన్ని కారణంగా చూపడం గమనార్హం.  2020 భారత్‌ వృద్ధి అంచనాలను మూడీస్‌ తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తొలుత 6.6 శాతం అంచనాలను ఫిబ్రవరిలో 5.4 శాతానికి కుదించడం జరిగింది. తాజాగా దీనినీ 5.3 శాతానికి తగ్గించింది. 2020లో భారత్‌ జీడీపీ 5.3 శాతం. 2018లో ఈ రేటు 7.4 శాతంగా ఉంది.   తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- 2021లో  వృద్ధి రేటు కాస్త పుంజుకుని 5.8 శాతంగా నమోదుకావచ్చు. 
- కరోనా వైరస్‌ వల్ల దేశీయంగా డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. వస్తు సేవల సరఫరా చైన్లలో అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడ్డం దీనికి కారణం. 
- పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే కరోనా ప్రభావంతో అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు మందగమన ధోరణులను ఎదుర్కొనడానికి ప్రపంచవ్యప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్‌ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న అంశాలను వేచిచూడాల్సి ఉంది. 
- ఇక అతి తక్కువ స్థాయి చమురు ధరల విషయానికి వస్తే, చమురు ఎగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రబావం చూపించకపోవచ్చు. అయితే దిగుమతి దేశాలకు వాణిజ్య లోటుకు సంబంధించి ఇది ఊరటనిస్తుంది. 
కోవిడ్‌ నష్టం... క్రూడ్‌ లాభం!
కాగా, కోవిడ్‌-19 వల్ల భారత్‌ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని తక్కువ స్థాయి క్రూడ్‌ ధర ‘తగిన భారీ స్థాయిలోనే’ సర్దుబాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం పేర్కొన్నారు. 2020-21లో ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యలు వృద్ధికి కొంత మేర ఊపునిస్తాయని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.  
 You may be interested

విదేశాలకు గోఎయిర్‌ సర్వీసులు రద్దు

Wednesday 18th March 2020

ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్‌ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు

నిధుల సమస్య లేదు!!

Wednesday 18th March 2020

- ఏటీఎంలు, శాఖల్లో పుష్కలంగా నగదు ఉంది - బుధవారం సాయంత్రం నుంచి అన్ని సేవల పునరుద్ధరణ - బ్యాంక్ ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్ అక్కర్లేదు - యస్‌ బ్యాంక్ 'సీఈవో' ప్రశాంత్ కుమార్ వెల్లడి ముంబై: ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్

Most from this category