News


సంస్కరణలతోనే భారత్‌ భారీ వృద్ధి

Saturday 18th January 2020
news_main1579319130.png-31006

  • ఐక్యరాజ్యసమితి నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

 

  • 2018లో భారత్‌ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది.  ఆయా ప్రతికూల అంశాల నేపథ్యంలో ప్రభుత్వం పలు ద్రవ్యపరమైన సంస్కరణలను చేపట్టింది. ఈ దన్నుతో 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేటరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్‌ అకౌంట్‌ లోటు, విదేశీ మారకద్రవ్య నిల్వల విషయంలో ఉన్న సానుకూలతలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 5.9 శాతం శ్రేణిలో భారత్‌ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. 
  • ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం ఈ ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. 
  • ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే వీలుంది. 
  • అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణి వల్ల యూరోపియన్‌ యూనియన్‌లో తయారీ రంగం బలహీనత కొనసాగుతోంది. తీవ్ర సవాళ్లు ఉన్నప్పటికీ, వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా తూర్పు ఆసియా కొనసాగనుంది. ఇక చైనా వృద్ధి 2019లో 6.1 శాతం, 2020లో 6 శాతంగా ‍కొనసాగనుంది. 2021లో మరింత తగ్గి 5.9 శాతానికి చేరనుంది. బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో, రష్యా ఫెడరేషన్‌, టర్కీల్లో 2020లో వృద్ధి కొంత మెరుగుపడవచ్చు.  


29యేళ్ల కనిష్టానికి చైనా వృద్ధి
2019లో చైనా వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోయింది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ డిమాండ్‌ మందగమనం, అమెరికాతో 18 నెలల వాణిజ్య యుద్ధం దీనికి ప్రధాన కారణాలని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. You may be interested

రెండు విమానాశ్రయ ప్రాజెక్టుల రేసులో జీఎంఆర్‌

Saturday 18th January 2020

హైదరాబాద్‌: మౌలిక రంగంలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుల వేటలో ఉంది. దక్షిణ యూరప్‌లోని మాంటినీగ్రోలో ఉన్న పోడ్గోరికా, టివట్‌ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికై ప్రాథమిక అర్హత (ప్రీ క్వాలిఫైడ్‌) సాధించిన నాలుగు కంపెనీల్లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఒకటి. కన్సెషన్‌ పీరియడ్‌ 30 ఏళ్లు. జీఎంఆర్‌తోపాటు ఇన్షియాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, గ్రూప్‌ ఏడీపీ కాన్సార్షియం, కార్పొరేషన్‌ అమెరికా ఎయిర్‌పోర్ట్‌ ఈ

అయిదేళ్లు.. 10 లక్షల ఉద్యోగాలు..

Saturday 18th January 2020

(అప్‌డేటెడ్‌...) ఐటీ, రిటైల్‌, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో కల్పన భారత్‌లో అమెజాన్ భారీ ప్రణాళికలు సంస్థ సీఈవో బెజోస్‌ వెల్లడి న్యూఢిల్లీ: అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించే యోచనలోనే ఉంది. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చిన సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

Most from this category