News


వృద్ధి 5.7 శాతమే!: నోమురా

Thursday 22nd August 2019
news_main1566446650.png-27934

  • ఏప్రిల్‌-జూన్‌పై అంచనా

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతమే నమోదవుతుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ-  నోమురా అంచనావేసింది. వినియోగం పడిపోవడం, పెట్టుబడుల బలహీనత, సేవల రంగం పేలవంగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని సంస్థ అంచనావేసింది. మందగమన పరిస్థితులకు ఇక తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతున్నట్లు సంబంధిత ఇండికేటర్స్‌ సూచిస్తున్నట్లు తెలిపింది. 2018-19లో 6.8 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30వ తేదీన ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక గణాంకాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. 



You may be interested

వృద్ధి బలహీనతే... రేటు కోతకు కారణం

Thursday 22nd August 2019

- ఆగస్టు 7 విధాన ప్రకటనపై ఆర్‌బీఐ మినిట్స్‌ విడుదల ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బలహీనత వల్లే ఆగస్టు 7 విధాన సమీక్ష సందర్భంగా 0.35 శాతం రేటు కోత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఆగస్టు 7 పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

Thursday 22nd August 2019

ఉదయం 7 గం.ల నుంచే ప్రారంభం భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్‌టీజీఎస్‌ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్‌ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టీజీఎస్‌) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్‌లైన్‌లో బదిలీ

Most from this category