News


2019లో భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

Thursday 12th December 2019
news_main1576121107.png-30181

  • ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా
  • 2020లో 6.5 శాతం ఉంటుందని విశ్లేషణ

 న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి పలు అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్‌ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్‌డేటెడ్‌ ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. 

రెండవసారి కోత...
నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ బలహీనంగా ఉండడం దీనికి కారణంగా తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా వృద్ధి రేటు అంచనాను 7 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచబ్యాంక్‌ అంచనా 6 శాతంగా ఉంది.


- ఇక దక్షిణ ఆసియా  విషయానికి వస్తే, 2019లో వృద్ధి రేటును 6.2 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గించింది. 2020కి సంబంధించి ఈ రేటును 6.7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది.  2018లో ఈ ప్రాంతం వృద్ధిరేటు 6.6 శాతం. 
- చైనా వృద్ధి రేటును 2019లో 6.2 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. 2020 విషయంలో ఈ అంచనా 6 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ఇదే నిజమైతే ఈ రెండేళ్లూ భారత్‌ వృద్ధిరేటు చైనాకన్నా తక్కువగా ఉంటుందన్నమాట. అయితే 2018 విషయంలో భారత్‌ తరహాలోనే చైనా రేటు 6.6 శాతంగా ఉంది. 
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఆసియా ప్రాంతం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఏడీబీ నివేదిక తెలిపింది. అమెరికా-చైనా మధ్య ఏదైనా ఒప్పందం కుదిరితే, వృద్ధి తాజా అంచనాలను మించే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. 



You may be interested

సౌదీ ఆరామ్‌ ‘‘కింగ్‌’’

Thursday 12th December 2019

లిస్టింగ్‌లోనే అదరగొట్టిన సౌదీ ఆరామ్‌కో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌కు షేర్‌ ధర  1.88 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిన సంస్థ విలువ  ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ విలువున్న కంపెనీగా ఘనత దుబాయ్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌ ధరను (9.39 డాలర్లు -రూ.662) తాకింది. ఈ ధర

దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు

Thursday 12th December 2019

ఎన్‌హెచ్‌ఏఐ ఇన్‌విట్‌కు ఆమోదం బ్యాంకులకు పాక్షిక రుణ హామీ పథకానికి ఓకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్‌ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి.

Most from this category