News


బంగారం రుణ మార్కెట్‌ రూ.4.61 లక్షల కోట్లు

Saturday 18th January 2020
Markets_main1579320412.png-31011

2020 నాటికి ఈ మార్క్‌ను చేరుకుంటుంది: కేపీఎంజీ
న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్‌ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్‌ రూ.4,617 బిలియన్‌ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది. 

నివేదికలోని అంశాలు

  • 2018-19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి. 
  • ఎన్‌బీఎఫ్‌సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్‌ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. 
  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్‌ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి.
  • ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్‌ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి.
  • దీంతో గతంలో బంగారంపై రుణాలు తీసుకున్న వారు ఎటువంటి తనఖా అవసరం లేని అన్‌సెక్యూర్డ్‌ రుణాలను పొందే అవకాశం లభించినట్టయింది. 
  • బంగారం రుణ మార్కెట్‌ ధరల పరంగా అస్థిరత, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్‌ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి. 
  • బ్యాంకులు రుణ వితరణలో ఆచితూచి, కఠినంగా ఉండడం, అదే సమయంలో బంగారం రుణ సంస్థలు భౌగోళికంగా భిన్న ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండడం, వేగవంతమైన నిర్ణయాల కారణంగా వృద్ధికి అధిక అవకాశాలు ఉన్నాయి.
  • ఇకపై ఈ సంస్థలు తమ ప్రస్తుత శాఖల ద్వారా ఆస్తుల నిర్వహణను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టొచ్చు. You may be interested

టెల్కోలకు ప్రభుత్వ సాయం: ఆర్‌బీఐ సూచన

Saturday 18th January 2020

మొండి బకాయిల సమస్య తలెత్తే అవకాశం టెలికం కంపెనీలకు భారీగా బ్యాంకు రుణాలు  బకాయిల జాబితాలో పీఎస్‌యూలకూ చోటు సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులకు సంబంధించి టెలికం కంపెనీలకు కొంతమేర ఉపశమనాన్ని కల్పించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంకు.. కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. మొండిబకాయిల(ఎన్‌పీఏలు) సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ.. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులపై తాత్కాలిక నిలిపివేత(మారటోరియం)ను ప్రకటించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ భారీ ఎన్‌పీఏలతో కుదేలైన

రిలయన్స్‌ డిజిటల్‌ రిపబ్లిక్‌డే ఆఫర్‌

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘రిలయన్స్‌ డిజిటల్‌’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా.. ఈ నెల 18 నుంచి 22 వరకు రూ. 1,000 చెల్లించి ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి, 23-26 కాలంలో కొనుగోళ్లపై రూ. 1,000 అదనంగా లభిస్తుందని వివరించింది. దీంతో పాటు క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. రిలయన్స్‌ డిజిటల్‌

Most from this category