News


ఇండియాలో 9 శాతం తగ్గిన పసిడి డిమాండ్‌: డబ్ల్యూజీసీ

Thursday 30th January 2020
news_main1580374601.png-31339


 
 9 శాతం తగ్గిన డిమాండ్‌

న్యూఢిల్లీ: భారత దేశంలో ఆపదసమయాల్లో ఆదుకుంటుందని బంగారంమీదే ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతుంటారు. కానీ 2019లో బంగారానికి డిమాడ్‌ 9 శాతం తగ్గి 690.4 టన్నులుగా నమోదైందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీసీ) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక మందగమనంతో పాటు రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరగడంతో  డిమాండ్‌ తగ్గిందని డబ్ల్యూజీసీ పేర్కొంది. కాగా 2018 సంవత్సరం ముగింపు ధరతో పోలిస్తే 24 శాతం పెరిగి 2019లో 10 గ్రాముల పసిడి రూ. 39,000పైన నమోదైంది. 2019 సంవత్సరంలో డిమాండ్‌ తక్కువగా ఉండడంతో దిగుమతులు 760.4(2018) టన్నుల నుంచి690.4 టన్నులకు తగ్గింది. డబ్ల్యూజీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరమ్‌ దీనిపై స్పందిస్తూ...దేశ ఆర్థిక వృద్ధి తగ్గడం, రీసైకిల్‌ చేసిన బంగారం సరఫరా 37 శాతం పెరగడం, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం దిగుమతులు తగ్గడానికి కారణమని చెప్పారు.  దేశీయంగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలతో ధన త్రయోదశి లాంటి  ప్రత్యేక శుభదినాల్లోనూ కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగడంతో పసిడి డిమాండ్‌ తగ్గిందన్నారు. ఈ ఏడాది కేం‍ద్రం చేపట్టే ఆర్థిక సంస్కరణలతో కొనుగోళ్లు పెరగవచ్చని, బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన 12.5 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తే దిగుమతులు పెరుగుతాయని తెలిపారు. 2020 జనవరి 15 నుంచి హాల్‌ మార్కింగ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో వినియోగదారులు పసిడి కోనుగోళ్లుపై దృష్టి పెట్టె అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్‌లో  చైనా తర్వాతా రెండో స్థానంలో ఉన్న ఇండియాలో 2020 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలతో డిమాండ్‌ 700 నుంచి 800 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందని ఆయనఅభిప్రాయపడ్డారు. 
 You may be interested

కరోనా.. కల్లోలం..

Thursday 30th January 2020

గ్లోబల్‌ మార్కెట్లను వణికిస్తున్న వైరస్‌ గురువారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతున్న ప్రపంచ ఈక్విటీలు చైనాలో ఆరంభమై క్రమంగా పలు దేశాలకు పాకుతున్న కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రపంచ మార్కెట్లు, కరెన్సీలు వణుకుతున్నాయి. కరోనా దెబ్బకు పలు దేశాలు చైనాకు విమానాల రాకపోకలు రద్దు చేసుకున్నాయి. ఈ వైరస్‌ ఒక తీవ్ర అంటువ్యాధిగా మారుతుందన్న భయాల నేపథ్యంలో చైనాలో పలు ఆఫీసులు, షాపులు మూసివేస్తున్నారు. దీంతో చైనా ఎకానమీపై తీవ్ర నెగిటివ్‌ ప్రభావం పడుతుందన్న

ఈ ఆరు రంగాలకూ బడ్జెట్‌ పుష్‌?!

Thursday 30th January 2020

ఆటో, మెటల్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆగ్రోకెమికల్స్‌ వినియోగ రంగానికీ చోటు? దేశ ప్రజలంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న​సాధారణ వార్షిక బడ్జెట్‌ను కేం‍ద్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుం‍ది. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే.. మౌలిక సదుపాయాల రంగానికి భారీ పెట్టుబడులు, వృద్ధికి ఊతమిచ్చే బాటలో వినియోగ రంగంలో డిమాండ్‌ పెంచే చర్యలతో పారిశ్రామిక రంగానికి జోష్‌నివ్వడం వంటి అంశాలపై కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ భారీ కసరత్తునే నిర్వహించినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

Most from this category