News


అంచనా కంటే భారత జీడీపీ వృద్ధి మరింత బలహీనం

Saturday 14th September 2019
news_main1568436204.png-28369

  • ఐఎంఎఫ్ ప్రకటన

వాషింగ్టన్‌: అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. కార్పొరేట్‌, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో దీర్ఘకాలం పాటు బలహీనతలే తన తాజా అంచనాలకు కారణాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. 2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. 2019, 2020లో భారత వృద్ధి రేటు నిదానంగా ఉంటుందని, రెండు సంవత్సరాల్లోనూ 0.3 శాతం మేర తగ్గొచ్చని ఐఎంఎఫ్‌ జూలైలో అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ బలహీనంగా ఉన్నందున 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతంగా ఉంటుందని తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థేనని, చైనా కంటే ఎంతో ముందుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత్‌ తాజా ఆర్థిక వృద్ధి రేటు అంచనా వేసిన దాని కంటే మరింత బలహీనంగా ఉందని ఐఎంఎఫ్‌ అధికార ప్రతినిధి జెర్రీరైస్‌ శుక్రవారం వాషింగ్టన్‌లో మీడియాతో పేర్కొన్నారు. భారత్‌లో జూన్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటుపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ భారత్‌లో ఆర్థిక పరిస్థితిని తాము గమనిస్తున్నట్టు చెప్పారు. తయారీ రంగంలో ఉత్పాదకత పడిపోవడం, వ్యవసాయ రంగం పనితీరు క్షీణతే ఇటీవలి జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలని జాతీయ గణాంక కార్యాలయం ఇటీవలే పేర్కొన్న విషయం గమనార్హం. 



You may be interested

రిటర్నుల ఈ-అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Saturday 14th September 2019

న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్‌ 8) నుంచి ఎలక్ట్రానిక్‌ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ-అసెస్‌మెంట్‌)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆర్థిక శాఖా శుక్రవారం గజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయింలో అ-అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్‌మెంట్‌కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖా అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై

జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

Saturday 14th September 2019

ఈ నెల 16 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వీడియో కంటెంట్‌ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 16 నుంచి వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో యాప్‌లో వీడియోస్‌ అనే ట్యాబ్‌ నుంచి వీటిని చూడొచ్చని తెలిపింది. 18 ఒరిజినల్‌ షోలను వచ్చే మూడు నెలల కాలంలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. షోలు అన్నీ కూడా ఆహారానికి సంబంధించినవేనని స్పష్టం చేసింది. 3-15 నిమిషాల

Most from this category