News


భారత్‌ ‘వృద్ధి’కి ఎస్‌అండ్‌పీ కోత

Thursday 19th March 2020
news_main1584587436.png-32565

- 5.7 శాతం నుంచి 5.2 శాతానికి కుదింపు
- మూడీస్‌ అంచనాకన్నా తక్కువ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఎస్‌అండ్‌పీ కోత పెట్టింది. క్యాలెండర్‌ ఇయర్‌లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా  నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్‌అండ్‌పీ, అమెరికా, యూరోప్‌ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. జపాన్‌ క్షీణత రేటును మరింతగా అంటే -0.4 శాతం నుంచి -1.2 శాతానికి పెంచింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్‌ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. 



You may be interested

చిన్న పొదుపులపై వడ్డీ తగ్గింపు!

Thursday 19th March 2020

న్యూఢిల్లీ: చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. వచ్చే త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న సరళతర వడ్డీరేట్ల విధానం ఈ నిర్ణయానికి నేపథ్యం కానుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి) కేంద్రం తగ్గించలేదు.

పతనంతో పని లేదు.. మూలాలు బలంగా ఉండాలి..!

Thursday 19th March 2020

సూచీలు జనవరిలో రికార్డు గరిష్టాల నుంచి ఇప్పటికే 30 శాతానికి పైగా పడిపోయాయి. కనుక చౌక విలువలో లభిస్తున్న షేర్ల కొనుగోలుకు (వ్యాల్యూ బయింగ్‌) ఇది అనుకూల సమయమేనా..? లేదా మార్కెట్లు మరింత పడిపోతాయా..? మార్కెట్లు ఎంత వరకు పడిపోతాయన్నది ఎవరూ చెప్పలేని విషయం. ఇప్పటికే చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి కనుక ఈ స్థాయి నుంచి పెట్టుబడులను కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్లడం మంచి విధానంగా నిపుణులు సూచిస్తున్నారు.    ‘‘ఇన్వెస్టర్లు తమ

Most from this category