News


అదుపుతప్పిన 2019-20 ద్రవ్యలోటు

Saturday 1st February 2020
news_main1580527121.png-31384

  • బడ్జెట్‌ అంచనాల్లో 132 శాతానికి అప్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అదుపు తప్పింది. 2019-20 బడ్జెట్‌ అంచనాల్లో 132.4 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే... 2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది 2019-20 బడ్జెట్‌ లక్ష్యం. ఇది 2019-20 జీడీపీ అంచనాల్లో 3.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌ ముగిసే నాటికే రూ.9,31,725 కోట్లుగా నమోదయ్యింది.  2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్ను భారీ తగ్గింపు కేం‍ద్ర ఖజానాపై భారీ ప్రభావం చూపింది. ఆదాయానికి రూ.1.45 లక్షల కోట్ల గండి పడిందని అంచనా. శనివారం ఆర్థికమంత్రి పార్లమెంటులో 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 2019-20 ద్రవ్యలోటు లక్ష్యాన్ని ఎగువముఖంగా కొంత సవరించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. 



You may be interested

2018-19లో వృద్ధి 6.1 శాతమే!

Saturday 1st February 2020

తొలి 6.8 శాతం గణాంకాల సవరణ న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6.1 శాతమేనని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు తొలి 6.8 శాతం గణాంకాలను దిగువముఖంగా సవరించినట్లు వివరించింది. మైనింగ్‌, తయారీ, వ్యవసాయ రంగాల క్షీణత దీనికి ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. విలువ రూపంలో చూస్తే, జీడీపీ రూ.131.75 లక్షల కోట్ల (2017-18)

ఎస్‌బీఐ లాభం రూ.6,797 కోట్లు

Saturday 1st February 2020

(అప్‌డేటెడ్‌...) 41 శాతం వృద్ధి  ఆదాయం రూ.95,384 కోట్లకు  ఈ క్యూ3లోనే అత్యధిక స్టాండ్‌అలోన్‌ నికర లాభం  న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ బ్యాంక్‌....స్టేట్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.6,797 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.4,823 కోట్లుతో పోల్చితే 41 శాతం వృద్ధి సాధించింది. కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది.

Most from this category